జాతీయ వార్తలు

అన్నిచోట్లా.. కాస్టింగ్ కౌచ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: పార్లమెంట్ కూడా కాస్టింగ్ కౌచ్‌కు మినహాయింపు కాదంటూ కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, రాజ్యసభ మాజీ సభ్యురాలు రేణుకా చౌదరి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. రేణుకా చౌదరి మంగళవారం కాస్టింగ్ కౌచ్ వ్యవహారంపై మాట్లాడుతూ పార్లమెంట్, ప్రభుత్వ కార్యాలయాలు కూడా కాస్టింగ్ కౌచ్‌కు మినహాయింపు కాదని చెప్పారు. సినిమా రంగంలో కాస్టింగ్ కౌచ్ ఉన్న మాట నిజమే.. అయితే మహిళలను ఉపయోగించుకుని వది లి వేయటం లేదు.. వారికి ఉపాధి కల్పిస్తున్నారంటూ ప్రముఖ నృత్య దర్శకురాలు సరోజ్‌ఖాన్ చేసిన వ్యాఖ్యలపై రేణుకా చౌదరి స్పందించారు. దేశంలోని ఏ ప్రాం తం కూడా కాస్టింగ్ కౌచ్‌కు మినహాయింపు కాదని రేణుకా చౌదరి స్పష్టం చేశారు. సినిమా పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ అనేది చేదు నిజం.. మొత్తం సినిమా పరిశ్రమ తనపై విరుచుకుపడవచ్చు కానీ ఇది నిజం.. అని రేణుకా చౌదరి చెప్పారు. కాస్టింగ్ కౌచ్ సినిమా పరిశ్రమకు మాత్రమే పరిమితం కాలేదు.. ప్రతిచోట జరుగుతోంది.. ప్రభుత్వ కార్యాలయాల్లోనూ మహిళల పట్ల ఇలానే వ్యవహరిస్తున్నారు.. పార్లమెంట్‌లో ఇలా జరుగదు.. మరోచోట ఇలా జరగదని ఊహించుకోవద్దు.. ఈ జాడ్యం అన్నిచోట్లా ఉంది అని రేణుకా చౌదరి అ న్నారు. పాశ్చాత్య దేశాల్లో ప్రఖ్యాత నటీమణులు తమ కు జరిగిన అన్యాయంపై ఇంతకాలానికి నోరు తెరుస్తున్నారు.. మాకూ అన్యాయం జరిగిందని చెబుతున్నారని ఆమె తెలిపారు. భారతదేశం కూడా లేచి నిలబడి కాస్టింగ్ కౌచ్‌పై నోరు విప్పాలని ఆమె సూచించారు.
ఉద్యోగానికి వెళ్లే మహిళలపై తమ ఇష్టానుసారం వ్యాఖ్యలు చేసినంత మాత్రాన పురుషులు గొప్పవారైపోతారా? అని రేణుకా చౌదరి ప్రశ్నించారు. మహిళలను కించపరిచే విధంగా రాయటం, పరిచయం లేని వారిపై అభిప్రాయాలు వ్యక్తం చేయటం అన్యాయం కా దా? అని ఆమె అన్నారు. మహిళలు పురుషుల ఆనందం కోసమేనా.. వాళ్ల పని పిల్లలను కనడమేనా.. పురుషులకు బాధ్యత లేదా అని రేణుకా చౌదరి ప్రశ్నించారు. మహిళల పట్ల ఎందుకిలా అసభ్యంగా వ్యవహరిస్తారని ఆమె నిలదీశారు. పని స్థలాల్లో మహిళల వేధింపులను అరికట్టేందుకు తాను ప్రత్యేక చట్టం చే యించానని ఆమె తెలిపారు. మహిళలు వౌనంగా ఉం టున్నారు కాబట్టే రేపిస్టులు బలపడుతున్నారని ఆమె అభిప్రాయపడ్డారు. మంచి పురుషులు ఉన్నారు కాబట్టే సమాజంలో కొంత సమానత్వం కొనసాగుతోందన్నా రు. మహిళల పట్ల గౌరవంతో మెలగాలని యువకుల కు నేర్పించవలసిన బాధ్యత తల్లిదండ్రులపై ఉన్నదని రేణుకా చౌదరి సూచించారు. తమపట్ల అసభ్యంగా వ్యవహరించే వారిని మహిళలు గట్టిగా ఎదుర్కోవాలి.. చెబితే విననివారిని దారికి తీసుకువచ్చేలా వ్యవహరించాలని సలహా ఇచ్చారు. రాజకీయాలు, పార్లమెంటులో కాస్టింగ్ కౌచ్ కష్టం.. అయితే పార్లమెంటులో మహిళలను మానసికంగా హింసించిన సంఘటనలు లేకపోలేదు. ఒక ప్రధాని నిలబడి మహిళలతో అసభ్యంగా మాట్లాడటం.. ఎత్తు, రంగు, బరువు గురించి మాట్లాడ టం అసభ్యం కాదా? మా తెలివి కనిపించటం లేదా? అని ఆమె ప్రశ్నించారు. ఆ వ్యాఖ్యలకు తానే లేచి ప్ర శ్నించానన్నారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు అప్‌లోడ్ చేసిన వీడియాలను డిలిట్ చేయలేదా? అని ఆమె ప్రశ్నించారు. సీనియర్ పోలీసు అధికారులు సైతం ఇష్టానుసారం మాట్లాడటం అన్యా యం కాదా? అని రేణుకా చౌదరి నిలదీశారు.