జాతీయ వార్తలు

వెంకయ్య నిర్ణయంపై ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు : శివసేన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 25: భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఏ)పై ప్రతిపక్షాలు ఇచ్చిన అవిశ్వాస నోటీసును రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు తిరస్కరించడంలో పెద్దగా ఆశ్చర్యపడాల్సిందేమీ లేదని శివసేన పేర్కొంది. ముఖ్యంగా అది నరేంద్రమోదీ, అమిత్ షాలను లక్ష్యం గా చేసుకున్నది కావడమే ఇందుకు కారణమని స్పష్టం చేసింది. ప్రజాస్వామ్యాన్ని నిలిపే నాలుగు స్తంభాలకు ‘చీడ‘ పట్టిందని అంటూ, ప్రజల విశ్వాసం కోల్పోయిన వారు ఎవరూ అధికారంలో ఉండజాలరన్న సంగతిని గుర్తు చేసింది. శివసేన అధికార పత్రిక ‘సామ్నా’లో రాసిన సంపాదకీయంలో పై అభిప్రాయాలను వెల్లడించింది. కాంగ్రెస్ నేతృత్వంలోని ఏడు విపక్షాలు ఐదు అంశాల్లో సీజేఐ ‘అనుచితంగా ప్రవర్తించారని’ పే ర్కొంటూ రాజ్యసభలో ఆయనపై అవిశ్వాస తీర్మాన నోటీసు ఇచ్చిన సం గతి తెలిసిందే. కొన్ని సాంకేతిక కారణాలతో పాటు, దీపక్ మిశ్రాపై వచ్చిన ఆరోపణలను వెంకయ్యనాయుడే నమ్మలేదని శివసేన పేర్కొంది. ‘నేడు కేవలం మోదీ, అమిత్ షాలు చెప్పిందే నిజం’ అని పేర్కొంది.