జాతీయ వార్తలు

వ్యవస్థకు ఎవరూ అతీతులు కారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 27: రిజర్వు బ్యాంకు గవర్నర్ రఘురామ్ రాజన్‌తోపాటు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలోని కొంతమంది అధికారులు ఆయా పదవులకు ‘తగనివారు’ అని బిజెపి ఎంపీ సుబ్రమణ్య స్వామి చేసిన ఇటీవల విమర్శలతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విభేదించారు. రఘురామ్ రాజన్‌కు దేశభక్తి లేదని స్వామి చేసిన వ్యాఖ్యలపై మోదీ సోమవారం స్పందిస్తూ, వ్యవస్థకు తాము అతీతులమని ఎవరు భావించినా తప్పే అవుతుందని స్పష్టం చేశారు. స్వామి ఇటీవల రిజర్వు బ్యాంకు గవర్నర్, ఆర్థిక శాఖ అధికారులతో పాటు ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీపై కూడా పరోక్షంగా ఘాటు విమర్శలు చేసిన విషయం విదితమే. అయితే స్వామి చేసిన విమర్శలతో తమకు సంబంధం లేదని జైట్లీతోపాటు బిజెపి దూరంగా జరుగుతున్న నేపథ్యంలో ప్రధాన మంత్రి పై వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. సుబ్రమణ్య స్వామి వ్యాఖ్యలు సముచితమైనవి కావని, అటువంటి వ్యాఖ్యలు ఎవరు చేసినా, చివరికి తాను చేసినా తప్పే అవుతుందని, ప్రచారంకోసం పాకులాడటం వలన దేశానికి మంచి జరగదని ‘టైమ్స్ నౌ’ వార్తా చానల్‌తో మోదీ అన్నారు. సుబ్రమణ్య స్వామి పేరును ప్రస్తావించకుండా ‘రాజన్‌పై మీ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ చేసిన వ్యాఖ్యలు సముచితమైనవేనా?’ అని ‘టైమ్స్ నౌ’ అడిగిన ప్రశ్నకు మోదీ పై వివరణ ఇచ్చారు.