జాతీయ వార్తలు

మమత ఓ శూర్పణఖ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలియా (యూపీ), ఏప్రిల్ 25: ప్రజల మధ్య మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బీజేపీ కేడర్‌ను ఉద్దేశించిన చెప్పిన మాటలు ఆ పార్టీ నేతల చెవికి ఎక్కడం లేదు. తాజా గా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ‘శూర్పణఖ’ అంటూ తిట్టిపోశాడు ఓ బీజేపీ ఎమ్మెల్యే. దాంతో పాటు కాంగ్రెస్ పార్టీని కూడా వదలకుండా ‘రావణుడు’తో పోల్చా డు. రామాయణంలో రావణుడి సోదరి శూర్పణఖ అనే విషయం తెలిసిందే. ఉత్తరప్రదేశ్‌లోని బాలియా నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఎన్నికైన సురేంద్ర సింగ్ గత రాత్రి జిల్లా పంచాయతీకి సంబంధించిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని ఉగ్రవాదులంతా పశ్చిమ బెంగాల్‌కు పారిపోతారని, అదే జరిగితే ఆ రాష్ట్రం మరో జమ్ము-కాశ్మీర్‌లా మారిపోతుందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశా డు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ రావణుడిలా, మమతా బెనర్జీ శూర్పణఖ అయిపోతారని తిట్టిపోశాడు. బంగ్లాదేశ్ నుంచి ఉగ్రవాదులు పశ్చిమ బెంగాల్‌లో చొరబడి హిందువులను హతమారుస్తున్నారని, దా న్ని నివారించడంలో మమతా విఫలమయ్యారని విమర్శించాడు. వచ్చే ఎన్నికల్లో ఈ శూర్పణఖను ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా ఓడిస్తారని వ్యాఖ్యానించాడు.