జాతీయ వార్తలు

ఫుల్‌కోర్టు పెట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: దేశంలోని అత్యున్నత న్యాయస్థానాన్ని వేధిస్తున్న సంస్థాగత సమస్యలపై చర్చించేందుకు ఫుల్‌కోర్టు ఏర్పా టు చేయాలని ఇద్దరు న్యాయమూర్తులు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. సుప్రీం చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రాకు రాసిన రెండు వాక్యాల లేఖపై జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎంబి లోకూర్‌లు సంతకాలు చేశారు. సీజేఐని అభిశంసించాలంటూ విపక్షాలు ఇచ్చిన నోటీసును రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు తిరస్కరించి 24 గంటలు తిరగకముందే ఇద్దరు సీనియర్ న్యాయమూర్తులు సీజేఐకి లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది. వచ్చే సోమవారం ఉదయం టీ విరామ సమయంలో అందరు న్యాయమూర్తులతో సమావేశం (్ఫల్ కోర్ట్) కావాలన్నది ఆ లేఖలోని సారాంశంగా తెలుస్తోంది. ఇందుకోసం పావుగంట ఆలస్యంగా కోర్టు ప్రొసీడింగ్స్ మొదలు పెడదామన్న ప్రతిపాదన కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ‘్ఫల్‌కోర్టు’ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనతో సీజేఐకి ఏప్రిల్ 22న రాసిన రెండు వాక్యాల లేఖలో సీనియర్ న్యాయమూర్తి రంజన్ గొగోయ్, ఎంబి లోకూర్ సంతకాలు చేసినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. సుప్రీంను వెంటాడుతున్న సంస్థాగత సమస్యలపై గత మార్చి 21న న్యాయమూర్తి జె చలమేశ్వర్, తరువాతి పరిణామాల్లో ఏప్రిల్ 9న జోసెఫ్ కురియన్‌లు సైతం సీజేఐ దృష్టికి తేవడం తెలిసిందే. న్యాయవ్యవస్థకు సంబంధించి ప్రజల్లో ఆసక్తికరమైన అంశాలు తలెత్తినపుడు సీజేఐ ఫుల్‌కోర్ట్ నిర్వహించటం ఆనవాయితీ. అయితే, ఫుల్‌కోర్టు నిర్వహించాలన్న న్యాయమూర్తుల లేఖపై సీజేఐ ఇంతవరకూ ఎలాంటి స్పం దనా వెల్లడించలేదని విశ్వసనీయవర్గాల సమాచారం. అక్టోబర్ 2తో దీప క్ మిశ్రా పదవీ కాలం పూర్తవుతుండటంతో, తరువాతి సీజేఐగా రంజన్ గొగోయ్ బాధ్యతలు స్వీకరించాల్సి ఉంది.