జాతీయ వార్తలు

యూపీ సిఎం అభ్యర్థిత్వం వద్దన్న షీలా దీక్షిత్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 27: ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలయిన షీలా దీక్షిత్ వచ్చే సంవత్సరం జరుగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆ పార్టీకి నేతృత్వం వహించడానికి విముఖత వ్యక్తం చేశారని తెలిసింది. ఒక న్యూస్ చానల్ కథనం ప్రకారం.. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక బ్రాహ్మణ నేతను కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలపాలని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సూచించారు. షీలా దీక్షిత్ ఇటీవల కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో భేటీ అయిన తరువాత ఆమెను యూపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా నియమిస్తారని ఊహాగానాలు వచ్చాయి. ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం కల్పించాలంటే సోనియాగాంధీ కుమార్తె ప్రియాంక గాంధీని క్రియాశీల రాజకీయాల్లోకి తీసుకురావాలనే వారి సంఖ్య ఇటీవలి కాలంలో పెరిగింది. యూపీలోని సుమారు 600 బ్లాకుల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇటీవల ప్రియాంకా గాంధీని క్రియాశీల రాజకీయాల్లోకి తీసుకురావాలని ప్రశాంత్ కిశోర్‌ను కోరినట్లు వార్తలు వచ్చాయి. ఒకప్పుడు రాష్ట్రంలోని అన్ని ఎంపి సీట్లను గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గత రెండు దశాబ్దాలుగా బాగా క్షీణించిపోయింది.