జాతీయ వార్తలు

రాజన్ వారసుడికోసం వేట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 27: త్వరలో పదవీ విరమణ చేయనున్న ఆర్‌బిఐ గవర్నర్ రఘురాం రాజన్ స్థానంలో కొత్తవారిని నియమించే ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నాలుగు అభ్యర్థులతో కేంద్రం జాబితాను ఖరారు చేసినట్టు తెలిసింది. సెప్టెంబర్‌లో రాజన్ పదవీకాలం ముగియనుంది. తాను మళ్లీ ఆర్‌బిఐ గవర్నర్ పదవి చేపట్టబోనని ఇటీవలే ఆయన ప్రకటించారు. అయితే ఆయననే కొనసాగించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దేశంలో ఆర్థిక వ్యవస్థను గాడిలోపెట్టడమే కాకుండా రాజన్ తీసుకున్న అనేక సంస్కరణలు మంచి ఫలితాలను ఇచ్చాయి. రాజన్ వైదొలిగినాసరే ఎలాంటి ఇబ్బందులూ ఉండవన్న సంకేతాన్ని మార్కెట్ వర్గాలకు ఇవ్వడానికి కేంద్రం అభ్యర్థుల జాబితాకు నడుంకట్టింది. దీన్లో భాగంగా నలుగురు సీనియర్ అధికారులతో ఓ జాబితాను ఖారారు చేసినట్టు తెలిసింది. అందులో ముగ్గురు సెంట్రల్ బ్యాంక్ సీనియర్లు, మరొకరు దేశంలోనే అతిపెద్ద వాణిజ్యబ్యాంక్ అధిపతి. అర్‌బిఐ డిప్యూటీ గవర్నర్ ఉర్జిత్‌పటేల్, మాజీ డిప్యూటీ గవర్నర్లు రాకేష్ మోహన్, సుబీర్ గోకర్న్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ అరుంధతీ భట్టాచార్య పేర్లు జాబితాలో ఉన్నాయి. కాగా ఆరుగురు సభ్యులుండే ఆర్‌బిఐ మానిటరీ పాలసీ కమిటీ కూర్పునకు సంబంధించి సర్చ్ కమిటీలో రాజన్ ఉంటారని అంటున్నారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయ అధికారి ఒకరు వెల్లడించారు. ఆర్‌బిఐ కొత్త గవర్నర్ వచ్చేనాటికే మానిటరీ పాలసీ కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్రం భావిస్తోంది. ‘ప్రస్తుత గవర్నర్ కమిటీ సభ్యులుగా ఉంటారన్న ఆశాభావంతో మేం ఉన్నాం’ అని ఆయన పేర్కొన్నారు. సాధ్యమైనంత త్వరగా అంటే ఆగస్టు 1 నాటికి కొత్త ప్యానెల్ ఏర్పడే అవకాశం ఉంది.