జాతీయ వార్తలు

భారత్‌కు అన్ని అర్హతలూ ఉన్నాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 27: అణు సరఫరాల గ్రూపు (ఎన్‌ఎస్‌జి)లో భారత్‌కు సభ్యత్వాన్ని కల్పించేందుకు అందులోని 48 సభ్య దేశాలతో కలసి తమ ప్రయత్నాలను కొనసాగిస్తామని అమెరికా ఉద్ఘాటించింది. ఈ గ్రూపులో చేరేందుకు భారత్‌కు అన్ని అర్హతలు ఉన్నాయని, అయినప్పటికీ ఇటీవల సియోల్‌లో ప్లీనరీ సమావేశాన్ని నిర్వహించిన ఎన్‌ఎస్‌జి తమ గ్రూపులో భారత్‌ను చేర్చుకోకపోవడం అమెరికాకు అసంతృప్తిని కలిగించిందని ఆ దేశ భారత రాయబారి రిచర్డ్ వర్మ సోమవారం తెలిపారు. భారత్-అమెరికా మధ్య పౌర అణు సహకారాన్ని ఆయన ప్రస్తావిస్తూ, 15 ఏళ్ల నాటి ఈ ప్రాజెక్టులో భాగంగా ఆరు రియాక్టర్లను నిర్మించి ఆరు కోట్ల మంది విద్యుత్‌ను అందించేందుకు ఇరు దేశాలు ముందడుగు వేశాయన్నారు. అమెరికా-్భరత్ ట్రేడ్ ఇనిషియేటివ్ అట్లాంటిక్ కౌన్సిల్ వర్క్‌షాప్‌లో రిచర్డ్ వర్మ ప్రసంగిస్తూ, పదేళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న పౌర అణు సహకార ఒప్పందం విషయంలో ఇరు దేశాల కృషి ఫలించి మరింత సన్నిహితంగా ముందుకు సాగుతుండటం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందన్నారు. భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వంతో పాటు అంతర్జాతీయ సంస్థల్లో భారత్ సముచిత ప్రాధాన్యతను పొందేందుకు అమెరికా మద్దతు తెలుపుతుందని ఆయన స్పష్టం చేశారు. ఆసియా-పసిఫిక్ ఆర్థిక సహకార సంఘం (ఎపెక్)తో పాటు అంతర్జాతీయ ఎగుమతుల నియంత్రణా ఒప్పందాల్లో భాగస్వామి అయ్యేందుకు భారత్ ఆసక్తి చూపుతుండటాన్ని స్వాగతిస్తున్నామని రిచర్డ్ వర్మ పేర్కొన్నారు.

చిత్రం రిచర్డ్ వర్మ