జాతీయ వార్తలు

సరిహద్దులో పాక్ గుళ్ల వర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూ, మే 18: జమ్మూలోని భారత్-పాకిస్తాన్ సరిహద్దులో పాక్‌దళాలు జరిపిన కాల్పుల్లో ఒక బిఎస్‌ఎఫ్ జవాన్, నలుగురు పౌరులు మృతి చెందగా, 12మంది గాయపడ్డారు. పాకిస్తాన్ దళాలు భారత్ సరిహద్దు గ్రామాలు, బోర్డర్ అవుట్‌పోస్టులపై గుళ్ల వర్షం కురిపించాయి. ఈనెల 19న ప్రధాని నరేంద్రమోదీ జమ్మూకాశ్మీర్ పర్యటన నేపథ్యంలో ఈ దాడులు జరగడం గమనార్హం. జమ్మూ రీజియన్‌లోని ఆర్‌ఎస్ పుర, బిష్న, ఆర్నియా సెక్టార్‌లలో పాక్‌దళాలు గుళ్లవర్షం కురిపించారు. ఈ దాడిలో 192 బెటాలియన్‌కు చెందిన సీతారామ్ ఉపాధ్యాయ అనే బిఎస్‌ఎఫ్ సైనికుడు గాయపడ్డాడు. అతడిని జమ్మూలోని జిఎంసి ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. ఒక జంట సహా నలుగురు సైతం మృతి చెందారు. అలాగే ఈ దాడిలో బిఎస్‌ఎఫ్‌కు చెందిన ఏఎస్‌ఐ సహా 12 మంది గాయపడ్డారు. కాగా రంజాన్ సందర్భంగా భారత భద్రతా దళాలు ‘కాల్పుల విరమణ’ పాటిస్తున్న నేపథ్యంలో పాక్ దళాలు కాల్పులకు తెగబడటం గమనార్హం.