జాతీయ వార్తలు

అనైతికతతో అధికారం.. బీజేపీ కొత్త విధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 18: అనైతిక విధానాలతో అధికారం చేజిక్కించుకోవడం బీజేపీ కొత్త పాలసీ అని శివసేన తీవ్రంగా ఆరోపించింది. కర్నాటకలో జరుగుతున్న పరిణామాలపై ఆ పార్టీ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ఒక్కో రాష్ట్రానికి ఒక్కో రూల్‌ను ఎలా అవలంబిస్తోందని ప్రశ్నించారు. కర్నాటకలో యడ్యూరప్పను ముఖ్యమంత్రిగాప్రమాణస్వీకారం చేయమని గవర్నర్ ఆహ్వానించడం తమకు ఆశ్చర్యం కలిగించలేదని శివసేన తన ‘సామ్నా’ పత్రిక సంపాదకీయంలో వ్యాఖ్యానించింది. యడ్యూరప్ప అత్యంత అవినీతిపరుడని అనుకోకుండా వ్యాఖ్యానించిన అమిత్‌షాయే ఇప్పుడు అతడిని తిరిగి ముఖ్యమంత్రిని చేయాలని అనుకుంటున్నారని శివసేన పేర్కొంది. కర్నాటక ప్రస్తుత గవర్నర్ వాజుభాయి వాలా బీజేపీకి విధేయుడైన నాయకుడని, అతను 14 సంవత్సరాల పాటు గుజరాత్ కేబినెట్‌లో మంత్రిగా పనిచేశాడని, అలాంటి వ్యక్తి కర్నాటకలో బీజీపీని కాకుండా, కాంగ్రెస్, జేడీ(ఎస్) కూటమిని ఎందుకు అధికారంలోకి ఆహ్వానిస్తాడని శివసేన వ్యాఖ్యానించింది.