జాతీయ వార్తలు

న్యాయవ్యవస్థపై కాంగ్రెస్ ద్వంద్వ విధానం: బీజేపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 18: న్యాయవ్యవస్థపై కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం అవలంబిస్తోందని బీజేపీ దుయ్యబట్టింది. మొన్నటివరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని అభిశంసన చేయాలని పట్టుబట్టి చట్టసభల్లో కూడా పెట్టి, అది కుదరకపోవడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించిన కాంగ్రెస్ ఇప్పుడు కర్నాటక ఉదంతంలో సుప్రీం ఆదేశాలతో పొగడ్తలతో ముంచెత్తుతూ ద్వంద్వ విధానాన్ని అవలంబిస్తోందని బీజేపీ అధికార ప్రతినిధి సాంబిత్‌పత్రా విమర్శించారు. న్యాయ, పత్రికా వ్యవస్థలు పాకిస్తాన్‌లోని నియంతృత్వ విధానంలో ఉన్నట్టు ఉన్నాయని కాంగ్రెస్ చీఫ్ రాహుల్‌గాంధీ పేర్కొన్నారని, అలాగే జస్టిస్ లోయా కేసులో కూడా సుప్రీం కోర్టును ఆ పార్టీ అవమానించిందని, ఇప్పుడు న్యాయవ్యవస్థపై పొగడ్తలు, అభినందనలు కురిపిస్తున్నారని అన్నారు. ఇది కాంగ్రెస్ నిజస్వరూపాన్ని బట్టబయలు చేస్తోందన్నారు. కర్నాటకలో ప్రజల తీర్పును కాంగ్రెస్ ఖూనీ చేసిందని ఆయన వ్యాఖ్యానించారు. తమకు అవసరమైన విధంగా రాజ్యాంగం మారదన్న విషయాన్ని కాంగ్రెస్ గ్రహించాలన్నారు. కొన్ని వార్తా పత్రికల కథనం ప్రకారం ఎన్నికల ఫలితాల ముందుగానే కాంగ్రెస్ కోర్టును ఆశ్రయించాలని అనుకుందన్నారు. బీజేపీ, జేడీ(ఎస్)లు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని, అలాకాకుండా ఏకైక అతిపెద్ద పార్టీ అయిన కాంగ్రెస్‌నే అధికారంలోకి పిలిచేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును ఆశ్రయించాలని కాంగ్రెస్ తొలుత భావించిందన్నారు. అలాంటి కాంగ్రెస్ ఇప్పుడు తమను అధికారంలోకి గవర్నర్ పిలిస్తే గుండెలు బాదుకుంటోందని విమర్శించారు.