జాతీయ వార్తలు

ఉత్తర-దక్షిణ వివక్ష లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 18: కేంద్రం నిధుల కేటాయింపు, పంపకం, ఇతర విషయాల్లో ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదని, ఇందులో ఉత్తర, దక్షిణ రాష్ట్రాల వివక్ష ఎంతమాత్రం లేదని 15వ ఆర్థిక సంఘం స్పష్టం చేసింది. నిధులు, ఇతర కేటాయింపుల్లో ఉత్తర రాష్ట్రాలకు ఒక విధంగా, దక్షిణ రాష్ట్రాలకు ఒకవిధంగా చేస్తూ వివక్ష చూపిస్తున్నారని వచ్చిన ఆరోపణలను కమిషన్ ఖండించింది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సులు రాష్ట్రాలను బికారులను చేస్తున్నాయని వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఉపరాష్టప్రతి వెంకయ్యనాయుడు శుక్రవారం కమిషన్ సభ్యులను కలిసి 15వ ఆర్థిక సంఘం సిఫార్సులతో రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్న ఆరోపణలపై వివరణ అడిగారు. కాగా గురువారం ఆరు బీజేపీయేతర రాష్ట్రాలకు చెందిన ఆర్థిక మంత్రులు రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసి 15వ ఆర్థిక సంఘంలోని నిబంధనలను సవరించాలని కోరారు. ఈ నిబంధనలు రాష్ట్రాల స్వయంప్రతిపత్తిని దెబ్బతీస్తున్నాయని, రాష్ట్రాలను ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆర్థిక సంఘం చైర్మన్, సభ్యులు, ఉపరాష్టప్రతితో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సంఘం అనుసరిస్తున్న విధానాలు, ఇతర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. కొన్ని రాష్ట్రాలకు కొన్ని అంశాల ప్రాతిపదికపై రెవెన్యూ పంపకంపై రిజర్వేషన్ వర్తిస్తుందని ఆర్థిక సంఘం చైర్మన్ ఎన్‌కెసింగ్ స్పష్టం చేశారు. అంతేకాకుండా కొన్ని రాష్ట్రాల ప్రత్యేక అవసరాలను దృష్టిలో ఉంచుకుని కమిషన్ వ్యవహరిస్తుందని చెప్పారు. కాగా 14వ ఆర్థిక సంఘం 1971 జనాభా ప్రాతిపదికన కేటాయింపులు జరగాలని సూచించగా, తాము 2011 జనాభాలెక్కల ప్రకారం చేస్తున్నామని, జనాభా నియంత్రణకు కృషి చేసిన రాష్ట్రాలను ప్రోత్సహిస్తున్నామని ఆయన చెప్పారు. కాగా, రాష్ట్రాల ప్రత్యేక అవసరాలు, వ్యవసాయంలోని సమస్యలు, ఇతర అంశాలను ఆర్థిక సంఘం దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాలని ఉపరాష్టప్రతి వెంకయ్య సూచించారు. ముఖ్యంగా వ్యవసాయ రంగ అభివృద్ధి, వౌలిక సదుపాయలపై కమిషన్ తన సిఫార్సులను చేయాలన్నారు.