జాతీయ వార్తలు

క‘ర్నాటకం’ మలుపెటు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, మే 18: కర్నాటక రాజకీయం ఎలాంటి మలుపుతిరగబోతోంది? ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన బలం లేకపోయినా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసేసిన బీఎస్ యెడ్యూరప్ప భవితవ్యం ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. అనూహ్యరీతిలో సుప్రీం కోర్టు జోక్యం చేసుకుని 15 రోజుల బలపరీక్ష గడువును పక్కన బెట్టి శనివారం సాయంత్రానికల్లా మెజారిటీని నిరూపించుకోవాలని ఆయనను ఆదేశించడంతో ఒక్కసారిగా జాతీయ స్థాయిలో రాష్టప్రరిణామాలు ఎలా ఉంటాయన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఏ పార్టీకీ మెజారిటీ కట్టబెట్టలేదు. దాంతో అనిశ్చితి ఏర్పడింది. సంకీర్ణ ప్రభుత్వమే శరణ్యమన్న పరిస్థితుల నేపథ్యంలో 104 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీనే ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించడం, బలపరీక్షకు 15 రోజుల గడువు ఇవ్వడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపాయి. తనకు 120 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ఆయన గట్టిగా చెబుతున్నా అందులో వాస్తవికత కనిపించడం లేదు. 78 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్, 37 మంది ఎమ్మెల్యేలు కలిగిన జేడీఎస్‌తో చేతులు కలిపింది. అలాగే ఎన్నికలకు ముందే జేడీఎస్‌తో ఒప్పందం కుదర్చుకున్న బీఎస్పీకి ఒక్క సీటు దక్కింది. ఈ మూడు పార్టీలు కలిస్తే మొత్తం బలం 116 అవుతుంది. అలాగే మరో ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేల మద్దతు తమకే ఉందని అంతిమంగా తమ బలం 118 అని కాంగ్రెస్-జేడీఎస్ కూటమి చెబుతోంది.
ఈ పరిస్థితుల్లో యెడ్యూరప్ప గెలవాలంటే 111 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాలి. ఒకవేళ ఎవరైనా గైర్హాజరయితే ఈ మెజారిటీ మార్క్ తగ్గేందుకు అవకాశం ఉంటుంది. 104 మంది సభ్యుల బలం కలిగిన బీజేపీ గెలవాలంటే ప్రతిపక్షాల నుంచి 14 ఎమ్మెల్యేలు గైర్హాజరు కావల్సి ఉంటుంది. అది ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యమయ్యే అవకాశం లేదు. ఈ పరిస్థితుల్లో శనివారం కర్నాటక అసెంబ్లీలో జరిగే ఏ రకమైన పరిణామాలు ఆవిష్కృతమవుతాయి? సుప్రీం ఆదేశం ప్రకారం జరిగే బలపరీక్షలో అవసరమైన మెజారిటీని యెడ్యూరప్ప సంతరించుకోలేకపోతే పరిస్థితి ఏమిటన్న ప్రశ్న తలెత్తుతోంది.

చిత్రం..కర్నాటక గవర్నర్ నిర్ణయానికి నిరసనగా బెంగళూరులో శుక్రవారం రాజ్‌భవన్‌కు ర్యాలీ నిర్వహించిన కాంగ్రెస్ శ్రేణులు