జాతీయ వార్తలు

మాకూ ఛాన్సివ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పనాజీ/ ఇంఫాల్/ పాట్నా, మే 18: రసకందాయంలో పడిన కర్నాటక రాజకీయం సెగలు రేపుతుంటే, ప్రతిపక్షంలోవున్న సింగిల్ లార్జెస్ట్ పార్టీల కొత్త డిమాండ్లతో రాజకీయం మరింత ఆసక్తికరంగా మారుతోంది. కర్నాటక గవర్నర్ అనుసరించిన రాజ్యాంగ విధానానే్న ఆయా రాష్ట్రాల్లోనూ అమలు చేయాలన్న డిమాండ్‌తో గోవా, మణిపూర్, బీహార్ రాష్ట్రాల్లోని కాంగ్రెస్, ఆర్జేడీలు గవర్నర్లకు లేఖలు ఇవ్వడం సరికొత్త అంకానికి తెరలేపినట్టయ్యింది. కర్నాటకలో అతి పెద్ద పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించినట్టుగానే, గోవాలో ఏకైక అతి పెద్ద పార్టీ అయిన కాంగ్రెస్‌ను బలనిరూపణకు అనుమతించాలంటూ గోవా కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఈమేరకు శుక్రవారం మధ్యాహ్నం రాజ్‌భవన్‌లో గవర్నర్ మృదులా సిన్హాకు కాంగ్రెస్ శాసన సభాపక్షం నేత చంద్రకాంత్ కావ్లేకర్ ఓ లేఖ సమర్పించారు. తమ లేఖపై వారంలో నిర్ణయం వెల్లడించాలని గవర్నర్‌ను కోరినట్టు కాంగ్రెస్ చెబుతోంది. ప్రతిపక్షంలోని 16మంది కాంగ్రెస్ సభ్యుల్లో 14మంది గవర్నర్‌ను కలిసిన వారిలోవున్నారు. ఒక ఎమ్మెల్యే విదేశాల్లో ఉన్నారని, మరో ఎమ్మెల్యే ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న కారణంగా హాజరుకాలేకపోయారని చెప్పారు. ‘కర్నాటక గవర్నర్ నిర్ణయానే్న ఇక్కడా అమలు చేయాలని లేఖలో కోరాం. బలంలేని పార్టీ (బీజేపీ)ని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తూ 2017 మార్చి 12న తీసుకున్న నిర్ణయాన్ని సరిదిద్దాలంటూ గవర్నర్‌కు విజ్ఞప్తి చేశాం’ అని కావ్లేకర్ స్పష్టం చేశారు. ‘వారంలో లేఖపై నిర్ణయం తీసుకోవాలంటూ గవర్నర్‌ను కోరాం’ అని వెల్లడించారు. 40 అసెంబ్లీ స్థానాలున్న గోవా అసెంబ్లీకి గత ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 17 అసెంబ్లీ స్థానాలు దక్కితే, బీజేపీ 13 స్థానాలు దక్కాయ. గోవా ఫార్వార్డ్ పార్టీ, మహారాష్టవ్రాది గోమంతక్ పార్టీ, ముగ్గురు స్వతంత్ర సభ్యుల మద్దతు కూడగట్టిన బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించటంతో, సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కావడం తెలిసిందే.
మణిపూర్‌లో..
అసెంబ్లీ ఎన్నికల్లో ఏకైక పెద్ద పార్టీగా అవతరించిన తమను బల నిరూపణకు ఆహ్వానించాలంటూ మణిపూర్ కాంగ్రెస్ సైతం గొంతువిప్పింది. ‘కర్నాటక విధానాన్ని అనుసరించి గవర్నర్ మమ్మల్నీ ఆహ్వానిస్తే ప్రభుత్వ ఏర్పాటుకు మేం సిద్ధం’ అంటూ కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి కెహెచ్ జైకిషన్ సింగ్ స్పష్టం చేశారు. కర్నాటకలో కాంగ్రెస్, జేడీ(ఎస్) కూటమిని కాదని, అతి పెద్ద పార్టీ ప్రాతిపదికన బీజేపీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించిన గవర్నర్ నిర్ణయానే్న ఇక్కడా అమలు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. అసెంబ్లీ ప్రతిపక్షం నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి ఓక్రమ్ ఇబోబి సింగ్ సారథ్యంలో తొమ్మిదిమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శుక్రవారం మధ్యాహ్నం రాజ్‌భవన్‌లో యాక్టింగ్ గవర్నర్ జగదీష్ ముఖిని కలిసి ఓ లేఖ సమర్పించారు. కర్నాటక మాదిరిగా గవర్నర్ తమనూ అనుమతిస్తే సభలో బల నిరూపణ చేసుకుని ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని లేఖలో పేర్కొన్నారు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో 60 స్థానాలున్న మణిపూర్ అసెంబ్లీలో కాంగ్రెస్ 28 స్థానాలు దక్కించుకుని ఏకైక అతి పెద్ద పార్టీగా నిలిచింది. అయితే 21 స్థానాలనే దక్కించుకున్న బీజేపీ ప్రాంతీయ పార్టీల మద్దతు సాధించటంతో, ప్రభుత్వ ఏర్పాటుకు అప్పటి గవర్నర్ నజ్మహెప్తుల్లా బీజేపీని ఆహ్వానించటం తెలిసిందే.
బిహార్‌లో ఆర్జేడీ సైతం..
కర్నాటక గవర్నర్ నిర్ణయాన్ని బిహార్‌లోనూ అమలు చేయాలంటూ ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ గవర్నర్ సత్యపాల్ మాలిక్‌కు లేఖ సమర్పించారు. తేజస్వివెంట కాంగ్రెస్, హిందస్థానీ ఆవామ్ మోర్చా (హెచ్‌ఎఎం), సీపీఐ (ఎంఎల్) నేతలు గవర్నర్‌ను కలిసిన వారిలో ఉన్నారు. గవర్నర్‌తో జరిగిన భేటీలో అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఏర్పడిన అవగాహనతో ఎకైక అతి పెద్ద కూటమిగా నిలిచిన ఆర్జేడీని ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలని కోరారు. ‘గవర్నర్‌ను కలిసి లేఖను సమర్పించాం. సభలో మరికొందరు ఎమ్మెల్యేలు సైతం ఈ కూటమివైపు మొగ్గు చూపే అవకాశం ఉంది’ అని తేజస్వి స్పష్టం చేశారు.

చిత్రాలు..మా మెజారిటీని నిరూపించుకునేందుకు అవకాశం ఇవ్వాలంటూ గవర్నర్‌కు వినతిపత్రం ఇస్తున్న గోవా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

*ఎన్నికలకు ముందే కూటమిగా ఏర్పడిన తమకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలంటూ పాట్నాలో రాజ్‌భవన్‌కు ర్యాలీగా వెళ్లిన ఆర్‌జెడి నేత తేజస్వి యాదవ్. ఈ ర్యాలీలో బిహార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారు.