జాతీయ వార్తలు

అట్టహాసంగా యదువీర్ వివాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైసూరు, జూన్ 27: మైసూరు రాజు యదువీర్ వివాహ వేడుక సోమవారం అత్యద్భుతంగా జరిగింది. చరిత్రాత్మక అంబావిలాస్ ప్యాలెస్‌లో దాదాపు 40 ఏళ్ల తరువాత వొడయార్ వంశానికి చెందిన టిటులర్ రాజు యదువీర్ కృష్ణదత్త చామరాజ, రాజస్థాన్‌కు చెందిన దుంగార్‌పుర్ రాజ కుటుంబం నుంచి వచ్చిన త్రిషిక కుమారి సింగ్‌ను వివాహం చేసుకున్నారు. దుంగార్‌పూర్ రాజ్‌పుత్‌లైన హర్షవర్ధన్‌సింగ్, మహేశ్రీ కుమారిల కూతురు త్రిషిక. రాజభవనంలోని దర్బార్ హాల్‌లో రాజకిరీటంతో, లేత బంగారు వర్ణంలో బంద్‌గలా ధరించిన యదువీర్, త్రిషికలు మల్లెల మాలలు మార్చుకున్నారు. ఆ తరువాత సంప్రదాయ బద్ధంగా తలంబ్రాలు పోసుకుని అగ్నిసాక్షిగా ఏడడుగులు నడిచారు. అంతకుముందు రాజగురువులైన పరకాల మఠాధిపతి అభినవ వాగీశ బ్రహ్మతంత్ర స్వతంత్ర స్వామికి యదువీర్ నమస్కరించి ఆశీస్సులు అందుకున్నారు. మైసూరు వొడయార్ వంశ రాజుల్లో చివరివాడైన శ్రీకంఠదత్త నరసింహరాజ సతీమణి ప్రమోదా దేవి వొడయార్ గత ఫిబ్రవరిలో యదువీర్‌ను దత్తత తీసుకున్నారు. మే నెలలో ఆయన టిటులర్ రాజుగా పట్ట్భాషక్తుడయ్యారు. ఈయన జయచామరాజేంద్ర వొడయార్ కూతురు గాయత్రీదేవికి మనవడు. బోస్టన్‌లోని మసాచుసెట్స్ యూనివర్సిటీ నుంచి యదువీర్ పట్ట్భద్రుడయ్యారు. దాదాపు 50 రాజకుటుంబాలు, కర్ణాటక రాజకీయ నేతలు, ఇతర వీఐపీలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. దేశ వ్యాప్తంగా రెండువేల మంది ప్రముఖులను ఈ వివాహ వేడుకకు ఆహ్వానించారు. బుధవారం రాజదంపతులు ప్యాలెస్ ప్రాంగణంలో ప్రజలకు అభివాదం చేస్తారు.