జాతీయ వార్తలు

ఇది ప్రజాస్వామ్య విజయం: మమత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 19: కర్నాటకలో బలనిరూపణకు ముందే బీజేపీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప పదవికి రాజీనామా చేయడం ప్రజాస్వామ్య విజయమని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొన్నారు. ఇది ప్రాంతీయ ఫ్రంట్ సాధించిన గెలుపని పేర్కొంటూ కాంగ్రెస్, జేడీఎస్ నాయకులను అభినందించారు.
‘ప్రజాస్వామ్యం గెలిచింది, దేవెగౌడ, కుమారస్వామి, కాంగ్రెస్ నాయకులకు ఇవే నా అభినందనలు, ఇది ప్రాంతీయ ఫ్రంట్ సాధించిన విజయం’ అని తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ ట్వీట్ చేశారు. 2019 బీజేపీని అధికారంలోంచి దించడానికి ఫెడరల్ ఫ్రంట్ ఆలోచనపై చర్చ జరగాలన్నారు. కాగా, గురువారం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన యడ్యూరప్ప మూడు రోజులు కూడా కాకముందే విధానసభలో తన మెజారిటీ నిరూపించుకోవడంలో విఫలమై శనివారం రాజీనామా చేశారు.
ఇది లౌకిక ప్రజాస్వామ్యవాదుల విజయం
కర్నాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప శనివారం శాసనసభలో విశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోకముందే రాజీనామా చేయడాన్ని ‘లౌకిక ప్రజాస్వామ్య వాదుల విజయం’గా వామపక్ష పార్టీలు అభివర్ణించాయ. బలనిరూపణకు సరిపడా సభ్యుల సంఖ్య బీజేపీకి ఎప్పుడూ లేదని, అయినా గవర్నర్ ఆ పార్టీని అధికారంలోకి ఆహ్వానించారని, అంతేకాకుండా బేరసారాలు జరుపుకోవడానికి ఎక్కువ సమయం ఇచ్చారని, అయితే ఇప్పుడు జరిగిన పరిణామాలతో బీజేపీ పతనం ప్రారంభమైందని సీపీఐ నేత డి.రాజా పేర్కొన్నారు. కర్నాటక పరిణామాలతో బీజేపీని అఖాతంలో ఉంచాలన్న విషయం లౌకిక ప్రజాస్వామ్య పార్టీలు అర్థం చేసుకోవాలని అన్నారు.