జాతీయ వార్తలు

యువత దారితప్పితే అస్థిరతే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, మే 19: దారితప్పిన యువత చేపట్టే ప్రతి రాయి, ఆయుధం కాశ్మీర్‌ను, దేశాన్ని ఆస్థిరపరుస్తుందని ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. అస్థిరత్వ వాతావరణం నుంచి బయటపడేందుకు రాష్ట్ర ప్రజలు తనవంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. రమజాన్ సందర్భంగా ఉగ్రవాద నిరోధక చర్యలకు తాత్కాలిక విరామం ప్రకటించిన నేపథ్యంలో, శనివారం ప్రధాని మోదీ కాశ్మీర్‌లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు హాజరయ్యారు. జమ్మూకాశ్మీర్‌ను అస్థిరపర్చేందుకు విదేశీ శక్తులు స్థానిక యువతను ప్రేరేపిస్తున్నాయని, ఈ విషయాన్ని జాగరూకతతో గమనించాలన్నారు. ప్రజలూ ఈ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని మోదీ పిలుపునిచ్చారు. ప్రమాదకర వాతావరణం నుంచి రాష్ట్రం బయటపడేందుకు ప్రజలు కలిసిరావాలని పిలుపునిచ్చారు. భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని దేశం, రాష్ట్భ్రావృద్ధి కోసం తప్పుడు మార్గాలను వీడి అభివృద్ధి బాట పట్టాలని యువతకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని సమస్యల పరిష్కారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక విధానం అనుసరిస్తున్నాయని మోదీ అన్నారు. ‘రాష్ట్భ్రావృద్ధి కోసం ప్రతి ఒక్కరూ మీ శక్తియుక్తులు వినియోగించాలని కోరుతున్నా. ఏ సమస్యలకైనా తుది పరిష్కారం కేవలం అభివృద్ధి, అభివృద్ధి, అభివృద్ధి’ అని మోదీ ఉద్ఘాటించారు. కాశ్మీర్‌లోని గురేజ్ ప్రాంతంలో నిర్మించిన 330 మెగావాట్ల కిషన్‌గంగా పవర్ ప్రాజెక్టును ఈ సందర్భంగా మోదీ జాతికి అంకితం చేశారు.
పశ్చిమ శ్రీనగర్‌లోని జలందర్ నుంచి బందిపోర జిల్లాలోని సంబల్‌ను కలుపుతూ 42.1 కిలోమీటర్ల రింగ్ రోడ్డు నిర్మాణానికి షెర్-ఇ-కాశ్మీర్ అంతర్జాతీయ సమావేశ కేంద్రం వద్ద మోదీ శంఖుస్థాపన చేశారు. ఈ రహదారిలో ట్రాఫిక్ రద్దీని నియంత్రించి సుఖవంతమైన, సమయానుకూల ప్రయాణానికి వీలు కల్పించాలన్నది ఈ రింగ్ రోడ్డు నిర్మాణ లక్ష్యం. సమానత్వం, సోదరభావమే జీవన లక్ష్యం కావాలంటూ మహ్మద్ ప్రవక్త సందేశమిచ్చిన రమజాన్ శుభమాసంలో ప్రాజెక్టును జాతికి అంకితం చేయడం ఆనందంగా ఉందన్నారు.
‘ఈ విద్యుత్ ప్రాజెక్టుతో కరెంట్ సమస్యలు తీరడమే కాదు, కావాల్సినంత విద్యుత్ రాష్ట్రానికి అందుబాటులోకి వస్తుందన్నారు. విద్యుత్ అవసరాల కోసం పొరుగు రాష్ట్రాలపై ఆధారపడే పరిస్థితి ఇక రాష్ట్రానికి ఉండదని, రాష్ట్ర ప్రజలకు సమృద్ధిగా విద్యుత్ అందుతుందన్నారు. ‘సౌకర్యవంతమైన పర్యాటకానికే పర్యాటకులు మొగ్గు చూపుతున్నారు. గంటల తరబడి సమయాన్ని వృధా చేసుకుంటూ, ఇరుకు లైన్లలో నిలబడాలని అనుకోవడం లేదు. ఆరోగ్యకరమైన, ఆధునికమైన వాతావరణం కల్పిస్తే పర్యాటక రంగాన్ని మరింత విస్తరించవచ్చు’ అని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాని మోదీ సూచించారు.

చిత్రం..కాశ్మీర్‌లో కృష్ణగంగ ప్రాజెక్టు శంకుస్థాపన సందర్భంగా మాట్లాడుతున్న ప్రధాని నరేంద్ర మోదీ