జాతీయ వార్తలు

ఇక సెలవులు ఎంజాయ్ చేద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 19: సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఏకే సిక్రీ శనివారం నవ్వులు పూయించారు. కర్నాటక రాజకీయ సంక్షోభం పరిసమాప్తం కావడంతో ఆయనో వ్యాఖ్య చేశారు. ‘ఇక మనం సెలవులు హాయిగా గడపవచ్చు’ అని జస్టిస్ సిక్రీ అన్నారు. ఆయనీ వ్యాఖ్యలు చేయగానే కోర్టు రూమ్‌లో ఉన్నవారంతా హాయిగానే నవ్వుకున్నారు. ఉత్కంఠ వాతావరణం కాస్తా తేలికపడింది. కర్నాటక వివాదానికి సంబంధించిన పిటిషన్‌న సిక్రీ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం విచారించింది. కోర్టులోనూ వాడీవేడిగా వాదోపవాదాలు జరుగుతున్నాయి. తీవ్రమైన ఉత్కంఠ. ఉద్విగ్న వాతావరం కోర్టు హాలులో నెలకొంది. సీనియర్ సభ్యుడిని కాదని జూనియర్ ఎమ్మెల్యే బోపయ్యను ప్రొటెం స్పీకర్‌గా గవర్నర్ నియమించారంటూ కాంగ్రెస్ సవాల్ చేసింది. కోర్టుకు సెలవుఅయినప్పటికీ పిటిషన్ విచారణకు పట్టుబట్టినట్టు కాంగ్రెస్ సీనియర్ నేత, సీనియర్ అడ్వొకేట్ కపిల్ సిబాల్ తొలుత ధర్మాసనానికి క్షమాపణ చెప్పారు. సిబాల్ ఆ మాట అనగానే జస్టిస్ సిక్రీ కలగజేసుకుని ‘మా రాజ్యాంగ విధులు మేం నిర్వర్తిస్తున్నాం’ అని అన్నారు. దీనిపై సిబాల్ మాట్లాడుతూ ‘కోర్టును ఇబ్బంది పెట్టాం. మాకు మరో ప్రత్యామ్నాయం కనిపించలేదు’అని చెప్పారు. ఇది జరుగుతుండగా కాంగ్రెస్- జేడీఎస్ తరఫున వాదిస్తున్న సీనియర్ అడ్వొకేట్ అభిశేక్ సింఘ్వీ మాట్లాడుతూ ‘ఆదివారం మీకు (బెంచ్)కు ఎలాంటి ఇబ్బంది కలిగించకూడదనే భావిస్తున్నారు. బహుశా రాకపోవచ్చని ఆశిస్తున్నాం’అని పేర్కొన్నారు. వెంటనే జస్టిస్ సిక్రీ జోక్యం చేసుకుని ‘మేం దానిపైనే చర్చిస్తున్నాం. మేం కూడా అదే అనుకుంటున్నాం’అన్నారు. కాగా కర్నాటకకు సంబంధించిన పిటిషన్‌పై శుక్రవారం విచారిస్తున్న జస్టిస్ సిక్రీ తన రిస్టార్‌లో 117 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. నాకు అవకాశం ఇవ్వండి అని యజమాని గవర్నర్‌ను అడిగినట్టు సోషల్ మీడియాలో వచ్చిందని అనగానే అనగానే కోర్టులో అందరూ నవ్వుకున్నారు.