జాతీయ వార్తలు

చెలిమి చర్చలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 20: భారత్ -రష్యాల మధ్య మరో శిఖరాగ్ర భేటీకి రంగం సిద్ధమైంది. ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం నుంచి జరిపే రష్యా పర్యటన ఇరు దేశాలు మరింత చేరువ కావడానికి ప్రాంతీయంగా, అంతర్జాతీయంగా సహకారాన్ని పెంపొందించుకోవడానికి ఈ పర్యటన దోహదం చేస్తుందని భావిస్తున్నారు. అంతర్జాతీయ ఉగ్రవాదం, ఇరాన్ అణు ఒప్పందం సహా అనేక అంశాలపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో చర్చించనున్న ప్రధాని మోదీ ‘ఈ పర్యటన ఎంతో ప్రత్యేకమైనది. ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఓ మలుపులాంటిది’ అని వ్యాఖ్యానించారు. తన పర్యటనను పురస్కరించుకుని రష్యా భాషలోను, అటు ఇంగ్లీష్‌లోను వరుస ట్వీట్లు చేసిన మోదీ, పుతిన్‌తో చర్చలగురించి ఎదురు చూస్తున్నానన్నారు. అలాగే భారత్‌పట్ల స్నేహపూర్వకంగా వ్యవహరిస్తున్న రష్యా ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. రష్యా పట్టణమైన సోచిలో సోమవారం పుతిన్, మోదీల భేటీ జరగనుంది. ఇటీవలే చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో వ్యక్తిగత శిఖరాగ్ర భేటీ జరిపిన మోదీ, ఇప్పుడు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తోనూ
అదే తరహాలో సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇరాన్ అణు ఒప్పందం నుంచి అమెరికా వైదొలగడం వల్ల కలిగే అంతర్జాతీయ ప్రభావం సహా అనేక ప్రాంతీయ, ప్రపంచ అంశాలపై వీరిద్దరి మధ్య విస్తృతస్థాయి చర్చలు జరుగుతాయని చెబుతున్నారు. పుతిన్‌తో తాను జరపబోయే చర్చలు విజయవంతం కాగలవన్న ధీమా వ్యక్తం చేసిన మోదీ, ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న భాగస్వామ్యానికి దీనివల్ల మరింత బలం చేకూరగలదన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఎలాంటి అజెండా లేకుండానే దాదాపు 4 నుంచి ఆరు గంటలపాటు చర్చలు జరుగుతాయని, ద్వైపాక్షిక అంశాలపై పరిమితస్థాయిలోనే మంతనాలు ఉంటాయని అధికార వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా అమెరికా తీసుకున్న నిర్ణయం వల్ల ఆర్థికంగా భారత్- రష్యాలపై పడే ప్రభావం గురించి వీరు చర్చించవచ్చని, దాంతోపాటు అఫ్గాన్, సిరియాలో తాజా పరిస్థితులు, ఉగ్రవాద ముప్పు, త్వరలో జరగనున్న షాంఘై సహకార మండలి సమావేశ అంశాలు కూడా చర్చకు రావొచ్చని చెబుతున్నారు. ఇతర దేశాలతో ప్రమేయం లేకుండానే రష్యాతో తన రక్షణ బంధాన్ని కొనసాగిస్తున్న భారత్, ఈ విషయంలో రాజీ పడేది లేదని ఎన్నో సందర్భాల్లో స్పష్టం చేసింది. పుతిన్, మోదీల తాజా భేటీ ప్రధాన ఉద్దేశం రెండు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలను పెంపొందించడంతోపాటు పరస్పర విశ్వసనీయతను ఇనుమడింప చేసుకోవడమేనని, అదేవిధంగా అంతర్జాతీయ ప్రాంతీయ అంశాల విషయంలో ఏకాభిప్రాయంతో వ్యవహరించడమేనని అధికార వర్గాలు తెలిపాయి. కాగా, భారత్ -రష్యాల మధ్య కుదిరిన పౌర అణు ఒప్పందాన్ని మూడో దేశానికి విస్తరించే అంశాన్ని కూడా వీరిద్దరూ చర్చించే అవకాశం ఉందని చెబుతున్నారు.