జాతీయ వార్తలు

24 గంటల్లోనే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, మే 20: కర్నాటకలో ప్రభుత్వం ఏర్పాటుకు యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు సాగుతున్నాయి. జేడీ(ఎస్) -కాంగ్రెస్ కూటమి నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు రెండు వర్గాలూ విస్తృత చర్చల్లో తలమునకలై ఉన్నాయి. ఆదివారం ఇరువర్గాలు జరిపిన చర్చల్లో ఒక ఒప్పందానికి వచ్చినట్టు సమాచారం. అలాగే, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 24 గంటలు తిరగకముందే విశ్వాస పరీక్షను ఎదుర్కోవడానికీ రంగం సిద్ధం చేసుకున్నారు. ఇదే విషయాన్ని ఆదివారం మీడియాతో మాట్లాడుతూ కూటమి సీఎం అభ్యర్థి కుమారస్వామి సైతం వెల్లడించారు. ఇదిలావుంటే, ఆదివారం జరిగిన ఇరువర్గాల భేటీలో ఏ పార్టీకి ఎన్ని పదవులు దక్కాలన్న అంశంపైనా లోతుగానే చర్చలు సాగినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే డిప్యూటీ సీఎంతోపాటు హోంమంత్రి పదవికి
కాంగ్రెస్ సీనియర్ నేత పరమేశ్వరకు అప్పగించేందుకు జేడీ(ఎస్) సైతం సముఖత వ్యక్తం చేయడంతో పంపకాలు కొలిక్కి వచ్చినట్టేనని అంటున్నారు. ఇదిలావుంటే, సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న జేడీ(ఎస్) నేత హెచ్‌డి కుమారస్వామి సోమవారం ఢిల్లీకి వెళ్తున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీని మర్యాద పూర్వకంగా కలుస్తారు. ఈనెల 23న (బుధవారం) ఇక్కడ జరిగే సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించనున్నట్టు సమాచారం. కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో మంత్రివర్గం కూర్పు, శాఖల కేటాయింపులు ఇతర అంశాలపైనా కాంగ్రెస్ చీఫ్ రాహుల్, సోనియాగాంధీతో చర్చించనున్నట్టు ఆదివారం కుమారస్వామి వెల్లడించారు. సీఎం పదవిని 30 నెలల చొప్పున జేడీ(ఎస్), కాంగ్రెస్ పార్టీలు పంచుకునే అంశమేమీ చర్చకు రాలేదని, అసలు అలాంటి ప్రతిపాదనే లేదన్నారు. సోమవారం తాను ఢిల్లీ వెళ్తున్నానని, ప్రభుత్వ ఏర్పాటుకు ముందే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, యూపీఏ చైర్‌పర్సన్ సోనియా, ఇతర పార్టీ పెద్దలను కలవనున్నట్టు చెప్పారు. ఈ చర్చల తర్వాతే మంత్రివర్గంలో ఏ పార్టీకి ఎన్ని కేటాయించాలన్న అంశంపై పూర్తిస్థాయి స్పష్టత వస్తుందన్నారు. మంత్రి పదవులు, పోర్ట్ఫులియోలపై మీడియా ఇష్టారీతిన కథనాలు ప్రచురించవద్దని విజ్ఞప్తి చేశారు. దీనివల్ల ప్రజల్లో గందరగోళం తలెత్తే ప్రమాదం ఉందని కుమారస్వామి అన్నారు. 24న స్పీకర్ ఎన్నిక, వెంటనే విశ్వాస పరీక్షను ముగించాలని భావిస్తున్నట్టు చెప్పారు. సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన 24 గంటల్లోనే విశ్వాస పరీక్షలో విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఇదిలావుంటే, పార్టీ వర్గాలు అందిస్తున్న సమాచారం ప్రకారం కంఠీరవ స్టేడియంలో కాకుండా ప్రమాణ స్వీకారాన్ని విధాన సౌధలోనే నిర్వహించే అవకాశం ఉంది. కార్యక్రమం ఎక్కడ నిర్వహించాలన్న విషయమై ఉన్నతాధికారులతో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకుంటామని కుమారస్వామి స్పష్టం చేశారు. పూర్వ ప్రధాని, తన తండ్రి దేవెగౌడను ఆదివారం కలిసిన కుమారస్వామి, పల అంశాలపై చర్చించి సలహాలు స్వీకరించినట్టు తెలుస్తోంది. ఉప ఎన్నికలు జరగనున్న రాజరాజేశ్వరి నగర్, జయనగర్ స్థానాల విషయమై కాంగ్రెస్‌తో చర్చించామన్న వార్తల్లో నిజం లేదని ఆయన కొట్టిపారేశారు. ఈ రెండు స్థానాల్లో విజయం సాధించాల్సిన అవసరం తమకుందన్నారు. ఇంతవరకు ఈ స్థానాలపై ఎలాంటి చర్చా జరగలేదని కుమారస్వామి మీడియాకు స్పష్టం చేశారు.