జాతీయ వార్తలు

బేరసారాలపై న్యాయ విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 20: కర్నాటకలో దొడ్డిదారి ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు బీజేపీ అనైతికంగా వ్యవహరించిందని, ఎమ్మెల్యేలకు డబ్బు ఎరచూపి ప్రలోభాలకు గురి చేసిందని, ఈ అంశాలపై విచారణకు ఆదేశించాలని కాంగ్రెస్ పార్టీ ప్రధాని నరేంద్ర మోదీని డిమాండ్ చేసింది. కర్నాటకలో బీజేపీ నిర్లజ్జగా వ్యవహరించిన తీరుపై ప్రధాని మోదీ స్పందించాలని ఎఐసీసీ అధికార ప్రతినిధి జైవీర్ షెర్గిల్ డిమాండ్ చేశారు. ఇక్కడ విలేఖర్లతో మాట్లాడుతూ, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా బీజేపీ వ్యవహార శైలి ఉందన్నారు. దేశాన్ని మతతత్వ శక్తుల గుప్పిట్లో నుంచి విముక్తి చేయాలన్నారు. ఈ లక్ష్యసాధనకు ముందుకు వచ్చే పార్టీలతో చేతులు కలిపేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. వచ్చే ఎన్నికల్లో ‘బైబై మోదీ’ అనే నినాదాలతో జనంలోకి వెళ్లనున్నట్లు చెప్పారు. దేశాన్ని దోచిన సొమ్ముతో ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసేందుకు బీజేపీ విశ్వప్రయత్నం చేసిందన్నారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా పెట్రో ధరలు పెంచకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల సమయంలో చమురు సంస్థలు పెట్రోధరలను పెంచుకండా నిలుపుదల చేయడం ఆ తర్వాత పెంచడం ఆనవాయితీగా మారిందన్నారు. వారణాసిలో వంతెన కూలిన ఘటనలో 18 మంది మరణించారని, వీరిని పరామర్శించేందుకు కూడా ప్రధాని వెళ్లలేదన్నారు. తనను ఎన్నుకున్న ప్రజలను మర్చిపోయి కఠినాత్ముడుగా మోదీ వ్యవహరిస్తున్నారన్నారు. పాకిస్తాన్ పూర్వ ప్రధాని నవాజ్ షరీఫ్ మనవరాలి పెళ్లికి హాజరయ్యేందుకు మోదీకి తీరికి ఉంటుందని, అదే వారణాసి ప్రజలను ఓదార్చేందుకు సమయం లేదా అని ఆయన నిలదీశారు.

చిత్రం..కాంగ్రెస్ ప్రతినిధి జైవీర్ షెర్గిల్