జాతీయ వార్తలు

ఆ సంతకం నిందితుడిది కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, మే 20: కథువా కేసులో నిందితుడు ఎగ్జామ్ అటెండెన్స్ షీటులో చేసినట్టు చెబుతున్న సంతకంతో అతని సంతకం మ్యాచ్ కావడం లేదని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్‌స్ లేబరేటరీ తన రిపోర్టులో వెల్లడించింది. జనవరిలో కథువా ప్రాంతంలో ఎనిమిది సంవత్సరాల బాలికపై సామూహిక అత్యాచారం చేసి ఘోరంగా హత్యచేసిన కేసులోప్రధాన నిందితుడిగా ఉన్న విశాల్ జనగోత్ర స్టేట్‌మెంట్‌లో పేర్కొన్న అంశం తప్పని ఫోరెన్సిక్ నిపుణులు నిర్ధారించారు. జనవరిలో బాలిక హత్య జరిగిన కథువా ప్రాంతంలో తాను అసలు లేనని, మీరట్‌లో కాలేజీ ఎగ్జామ్ రాస్తున్నానని, కావలిస్తే ఆ రోజు ఎగ్జామ్ అటెండెన్స్ షీటులో తాను చేసిన సంతకాన్ని పరిశీలింవచ్చునని నిందితుడు విశాల్ పేర్కొన్నాడు. ఈ మేరకు దర్యాప్తు బృందం జనవరి 15న అతను నిజంగా పరీక్షకు వచ్చాడా అని ఆరాతీసి, అతను సంతకం చేసినట్టు చెబుతున్న అటెండన్స్ షీటును ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. అయితే విశాల్ సంతకంతో షీటులోని సంతకం మ్యాచ్ కావడం లేదని ఫోరెన్సిక్ నిపుణులు నివేదిక ఇచ్చారు. దీంతో ఆ అటెండెన్స్ షీటులో విశాల్ కాకుండా అతని బదులుగా అతని స్నేహితులు ఎవరో సంతకం చేసి ఉంటారని దర్యాప్తు బృందం అనుమానిస్తోంది. ఆరోజు జమ్మూ నుంచి మీరట్ వచ్చే రైలు ఆలస్యంగా వచ్చిందని, ఆ సమయానికి పరీక్ష కూడా ఆయిపోయిందని దర్యాప్తు బృందం నిర్ధారించింది. కాగా, ఈ కేసులో పోలీసులు విశాల్ స్నేహితులైన సచిన్, నీరజ్, సహాలను ప్రశ్నించడానికి ప్రయత్నించగా వారు సుప్రీంను ఆశ్రయించారు. పోలీసులు తమను వేధిస్తున్నారని, విచారణ నుంచి తమను మినహాయించాలని కోరగా, మే 17న సుప్రీం దానిని నిరాకరించింది. అయితే నిందితులకు ఎలాంటి వేధింపులు చేయకూడదని కొన్ని సూచనలు చేసింది.