జాతీయ వార్తలు

కేంద్ర సిబ్బందికి బొనాంజా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 27: కోటి మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం కలిగించే ఏడో వేతన సంఘం సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం త్వరలోనే అమలు చేసే అవకాశం ఉంది. వేతన సంఘం సిఫార్సులపై కేబినెట్ కార్యదర్శి పికె సిన్హా సారథ్యంలో అధ్యయనం జరిపిన కమిటీ తన నివేదికను సమర్పించింది. దీన్ని కేంద్రం ఆమోదించే అవకాశం ఉందని, ఈ నెల 29లోగానే అమలుపై నిర్ణయం తీసుకోవచ్చునని ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. కమిటీ సిఫార్సుల ప్రాతిపదికగా ఆర్థిక మంత్రిత్వ శాఖ కేబినెట్ నోట్‌ను కూడా సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇవి అమలులోకి వస్తే కేంద్ర సిబ్బంది, పెన్షనర్లకు 23.5శాతం మేర అధికంగా లబ్ధి చేకూరుతుంది. దాదాపు 50లక్షల మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులకు, 58లక్షల మందికిపైగా పెన్షనర్లకు ప్రయోజనం కలిగించే విధంగా ఈ కమిటీ అనేక సిఫార్సులు చేసింది. సిబ్బంది కనీస ప్రారంభ జీతం 23,500 గరిష్ఠ జీతం 3లక్షల 25వేల రూపాయలు ఉండాలని ప్యానల్ సిఫార్సు చేసినట్టుగా తెలుస్తోంది. ఈ సిఫార్సులు అమలు చేయడానికి 70వేల కోట్ల రూపాయలను ఇప్పటికే ప్రత్యేకించడం జరిగిందని అధికార వర్గాలు వెల్లడించాయి.