జాతీయ వార్తలు

‘ఎన్నికల కోడ్ వల్ల పాలనేమీ స్తంభించదు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 20: ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని విధించడం వల్ల పాలన స్తంభిస్తుందన్న వాదనలను కేంద్ర ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. ఈ సమయంలో కేవలం కొత్త ప్రాజెక్టులు, కొత్త పథకాలు మాత్రమే ప్రకటించేందుకు ఎన్నికల కోడ్ అనుమతించదని పేర్కొన్నారు. ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం లా కమిషన్ ప్యానెల్‌కు స్పష్టం చేసింది. అసెంబ్లీలకు, లోక్‌సభకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే విషయమై కేంద్ర ఎన్నికల సంఘం, లా కమిషన్ సభ్యులు ఇటీవల సమావేశమై చర్చించారు. ఎన్నికల కోడ్‌ను విధించడం వల్ల ప్రభుత్వ పాలనపై ప్రతికూల ప్రభావం పడుతోందన్న వాదనల్లో నిజం లేదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.