జాతీయ వార్తలు

కలసి ఉంటే.. బీజేపీ పరార్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, మే 20: ఇటీవల జరిగిన కర్నాటక ఎన్నికల ఫలితాలు దేశంలోని కొత్త రాజకీయ పొత్తులకు, కొత్త సమీకరణాలకు మార్గం చూపుతున్నాయి. ‘కలసి ఉంటే కలదు బీజేపీ పరాజయం’ అన్న కొత్త నానుడికి అంకురార్పణ చేసేలా వివిధ పార్టీలు అన్నీ ఏకతాటిపైకి రావడానికి ఇప్పటి నుంచే చర్చోపచర్చలు ప్రారంభించాయి. 2019 ఎన్నికల్లో బీజీపియేతర పార్టీలు ఏకమైతే ఆ పార్టీని మట్టికరిపించడం సులభమవుతుందన్న వ్యూహం తెరపైకి వచ్చింది. బీజేపీ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఉంటే ఆ పార్టీకి పరాజయం తప్పదని, ఇటీవల జరిగిన కర్నాటక ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద ఏకైక పార్టీగా అవతరించినప్పటికీ, బీజీపీ వ్యతిరేక పార్టీ ఓటు రెండు పార్టీలకు చీలిపోవడం, అయినా ఆ రెండు పార్టీలు కలవడం వల్ల ఇప్పుడు బీజేపీ ఆ రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోలేని పరిస్థితిలో ఉందని సమాజ్‌వాద్, బహుజన సమాజ్, కాంగ్రెస్ పార్టీలు పేర్కొన్నాయి. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలిపోయి తిరిగి బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం పార్టీలు ఇవ్వకూడదని సమాజ్‌వాద్ పార్టీ అధికార ప్రతినిధి రాజేంద్ర చౌదరి చెప్పారు. ఇదే విషయం ఇటీవల జరిగిన గోరఖ్‌పూర్, ఫూల్‌పూర్ ఎన్నికలు సైతం రుజువు చేశాయని తెలిపారు. ఆ నియోజకవర్గాల్లో బీజేపీ సిట్టింగ్ స్థానాలైనప్పటికీ బిఎస్పీ సహాయంతో సమాజ్‌వాద్ పార్టీ విజయం సాధించిన విషయాన్ని మరువరాదన్నారు. దీనిని కాంగ్రెస్ అధికార ప్రతినిధి ద్విజేంద్ర త్రిపాఠి సైతం అంగీకరిస్తూ కర్నాటక ఎన్నికల్లో సైతం విపక్షాలు ఏకమవ్వడం వల్లే బీజేపీ అధికారానికి దూరమైందని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో విపక్షాలు ఏకమవ్వాలని, దీనివల్ల కేవలం ఎన్నికల్లో విజయం సాధించడమే కాక రాజ్యాంగ పరిరక్షణ చేసిన వారమవుతామని పేర్కొన్నారు. కర్నాటక ఫలితాలపై బిఎస్పీ అధినేత్రి మాయావతి స్పందిస్తూ ముస్లింల ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో కాంగ్రెస్ తన ప్రచార వైఖరిని మార్చుకోవాలని సూచించారు. రాష్ట్రీయ లోక్‌దళ్ అధికార ప్రతినిధి అనిల్‌దుబే మాట్లాడుతూ బీజేపీయేతర పార్టీలన్నీ ఒకే వేదికపైకి వచ్చి ఆ పార్టీ దూకుడును అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. విపక్షాల ఐకమత్యం వల్లే బీజేపీ అధికారానికి దూరమైందన్న విషయం కర్నాటక ఎన్నికలు రుజువు చేశాయని, విపక్షాల ఐకమత్యంతోనే బీజేపీని మట్టికరిపించవచ్చునని రాజకీయ విశే్లషకుడు, లక్నో యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ శాఖ హెడ్ రమేష్ దీక్షిత్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలను కలుపుకుని వచ్చే ఎన్నికల్లో పోటీచేయాలని ఆయన సూచించారు. అంతేకాకుండా సుహెల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ, అప్నాదళ్ వంటి పార్టీలతో బీజేపీ పొత్తుపెట్టుకుని యూపీలో అధికారంలోకి వచ్చిన విషయాన్ని మనం మరువరాదన్నారు. పార్టీలు చిన్నవైనా బీజేపీ వ్యతిరేక ఓటును ఒకచోట ప్రోదుపరిచేలా అవి తోడ్పడతాయని ఆయన అన్నారు. 2017లో జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో 41.35 శాతం ఓట్లతో మొత్తం 403 సీట్లలో 325 స్థానాలను బీజేపీ కైవసం చేసుకోగా, 28.07 శాతం ఓట్లు సంపాదించిన సమాజ్‌వాద్ పార్టీ గతంలో పొందిన 224 సీట్ల నుంచి 54 సీట్లకు దిగజారిందని ఆయన చెప్పారు. అలాగే బీఎస్పీ 80 సీట్ల నుంచి 19 స్థానాలకు పడిపోయిందన్నారు. ఇక్కడ విపక్షాలు విడివిడిగా పోటీ చేయడం వల్లే ఇలాంటి ఫలితాలు వచ్చాయన్నారు. అలాకాకుండా ఇవి పొత్తుపెట్టుకుని సీట్లు పంచుకుని అందరూ కలిసి బీజేపీకి వ్యతిరేకంగా పోటీచేస్తే కచ్చితంగా ఆ పార్టీ మట్టికరుస్తుందని ఆయన విశే్లషించారు.