జాతీయ వార్తలు

సవాళ్లకు దీటుగా పరిశోధనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొహాలి, మే 20: వాతావరణ మార్పు, నీటి కొరత వంటి సవాళ్లను దీటుగా ఎదుర్కొనేందుకు అవసరమైన పరిశోధనలు చేపట్టాలని రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ శాస్తవ్రేత్తలు, విద్యార్థులకు పిలుపునిచ్చారు. జాతి నిర్మాణంలో శాస్త్ర సాంకేతిక రంగాలదే కీలకపాత్ర అన్నారు. ఇక్కడ ఆదివారం నిర్వహించిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్‌ఈఆర్) స్నాతకోత్సవంలో పాల్గొని ఆయన ప్రసంగించారు. ‘మీరు నేర్చుకున్నదాన్ని సమాజానికి ముఖ్యంగా అణగారిన వర్గాలకు ప్రయోజనం కలిగించేలా ఉపయోగించండి’ అన్నారు. అభివృద్ధికి సంబంధించిన ప్రశ్నలకు సమాధానం శాస్త్ర-సాంకేతిక రంగాలు మాత్రమేనన్నారు. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు వాతావరణ మార్పు, రెండవది నిరుపేదలకు అందుబాటులోకి వైద్యాన్ని తీసుకొని రావడం, రైతులు పంట ఉత్పత్తులను పెంచాలంటే నీటికొరత ఉండకూడదు, దీనికి తోడు తాగునీటి సమస్య. అందువల్ల శాస్త్ర-సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ సవాళ్లకు సమాధానం కనుగొనడానికి ఉపయోగించాలని కోరారు. ‘ఉత్పత్తి ఆవిష్కరణ, నవీకరణ, ప్రయోగశాలలో నేర్చుకున్నదాన్ని వాణిజ్యపరమైన ఉత్పత్తులుగా మార్చడంలో సాంకేతిక పరిజ్ఞానం ఎంతో సహకరిస్తుందన్నారు. పరిశోధనా సంస్థలు, సాంకేతికపరమైన స్టార్ట్-అప్‌లు, ఇంక్యుబేషన్ సెంటర్లు, విజ్ఞానంతో కూడిన వ్యాపార సంస్కృతి ఎప్పటికప్పుడు మారుతుండాలన్నారు. క్యాలిఫోర్నియాలోని సిలికాన్ వ్యాలీ, మనదేశంలోని బెంగళూరు ఇందుకు గొప్ప ఉదాహరణ అని పేర్కొన్నారు. కాగా ఐఐఎస్‌ఈఆర్ నుంచి మొత్తం 152 మంది విద్యార్థులు అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్‌గ్రాడ్యుయేట్, పీహెచ్‌డీ రంగాల్లో పట్టాలు పొందుతుండగా వీరిలో 66 మంది బాలికలు ఉండటం ఎంతో ఆనందం కలిగిస్తోందన్నారు.

చిత్రం..ఐఐఎస్‌ఈఆర్ స్నాతకోత్సవంలో పట్టాలను ప్రదానం చేస్తున్న రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్