జాతీయ వార్తలు

ఈశాన్య ప్రాంతంలో శాంతిని సాధించాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గువహతి, మే 20: మోదీ ప్రభుత్వం మాత్రమే ఈ ప్రాంతానికి శాంతి, సుస్థిరతలను, అభివృద్ధికి దోహదం చేసిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వాల నిర్వాకం వల్ల ఈ ప్రాంతం దారుణమైన వెనుకబాటుకు గురైందని ఆరోపించారు. బంగ్లాదేశ్, మయన్మార్, భూటాన్ వంటి పొరుగు దేశాలతో సత్సంబంధాలను నెరపడం ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ ఈశాన్య భారత ప్రాంతాన్ని ఆర్థికంగా మరింత బలోపేతం చేస్తారన్నారు. ఈశాన్య ప్రజాస్వామ్య సంఘటన (ఎన్‌ఈడీఏ) మూడో సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఈ ప్రాంతానికి చెందిన ఆరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సమావేశానికి హజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ బంగ్లాదేశ్‌తో కుదిరిన సరిహద్దు ఒప్పందం ఈశాన్య ప్రాంత అభివృద్ధికి దోహదం చేస్తుందన్నారు. వచ్చే ఐదు పదేళ్ల కాలంలో ఈశాన్య భారత్‌లో జరిగే ఉత్పత్తులు, బంగ్లాదేశ్ పోర్టులనుంచి ఎగుమతి చేసుకోవడానికి ఈ ఒప్పందం వీలు కల్పిస్తుందన్నారు. అంతేకాదు ఈ ప్రాంతంలో పండే ఉత్పత్తులను బంగ్లాదేశ్‌కు ఎగుమతి చేసుకోవచ్చని కూడా అన్నారు. స్వాతంత్య్రం వచ్చిన కాలంలో ఆస్సాం సహా ఈ ప్రాంతంలోని వివిధ రాష్ట్రాలు అత్యధిక వృద్ధి రేటును కలిగివుండేవని, తర్వాత వచ్చిన కాంగ్రెస్ పాలనలో ఇది దారుణంగా పడిపోయిందన్నారు. మోదీ ప్రారంభించిన చర్యలను ఈశాన్య ప్రాంతాలు అనుసరిస్తే ప్రగతి వేగం పుంజుకుంటుందన్నారు. ఇప్పటికే గత నాలుగేళ్ల కాలంలో ఈ ప్రాంతంలో శాంతి నెలకొనేందుకు మోదీ కృషి చేశారన్నారు. ముఖ్యంగా భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్ దేశాలతో సరిహద్దు వివాదాలను పరిష్కరించడం వల్లనే శాంతి సాధ్యమైందన్నారు. మోదీ ప్రారంభించిన యాక్ట్ ఈస్ట్ పాలసీ వల్ల ఆగ్నేయాసియా దేశాలతో సంబంధాలు మరింత మెరుగయ్యాయన్నారు. యాక్ట్ ఈస్ట్‌పాలసీ అమలుతో పాటు ఈ ప్రాంతాన్ని ఆర్థికంగా మరింత వృద్ది చేయడంలో ఎన్‌ఈడీఏ ప్రధాన పాత్ర పోషించాల్సిన అవసరం ఉన్నదన్నారు.