జాతీయ వార్తలు

నీరవ్ మోదీ ఆచూకీకోసం త్వరలో రెడ్‌కార్నర్ నోటీసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 20: పంజాబ్ నేషనల్ బ్యాంకులో 2 బలియన్ డాలర్లకుపైగా కుంభకోణానికి పాల్పడి విదేశాలకు పరారైన వ్యాపారవేత్త నీరవ్ మోదీ, అతని అంకుల్ చోక్సీలపై రెడ్‌కార్నర్ నోటీసులు జారీ చేయడానికి సీబీఐ సిద్ధమవుతోంది. ఈ మేరకు సీబీఐ ఇంటర్‌పోల్‌ని ఆశ్రయించనుంది. గీతాంజలి గ్రూప్ ప్రమోటర్లయిన మోదీ, అతని భార్య అమి, సోదరుడు నిషాల్ బెల్జియన్, అంకుల్ చోక్సీలు లెటర్స్ ఆఫ్ అండర్ టేకింగ్ (ఎల్‌ఓయు), ఫారిన్ లెటర్స్ ఆఫ్ క్రెడిట్ (ఎఫ్‌ఎల్‌సి) పేర పంజాబ్‌నేషనల్ బ్యాంకుకు వేలకోట్లకు టోపీ పెట్టారు. దీనిపై బ్యాంకువారు సీబీఐకి ఫిర్యాదు చేసి కేసును అప్పగించేలోపునే నీరవ్‌మోదీ బృందం దేశాన్ని విడిచి పరారైంది. ఇటీవలే సిబీఐ వీరిపై చార్జిషీటును దాఖలు చేసింది. విదేశాల్లో వీరిని విచారణ నిమిత్తం భారత్‌కు రప్పించేలా రెడ్‌కార్నర్ నోటీసును జారీ చేయాలని, దీనికోసం ఇంటర్‌పోల్‌ను సంప్రదించాలని సీబీఐ నిర్ణయించినట్టు అధికారవర్గాలు తెలియజేశాయి. అంతకుముందు కేసు నమోదైన వెంటనే ఇంటర్‌పోల్‌కు ఒకనోటీసు జారీ చేసింది. మోదీ, చోక్సీ బృందం కదలికలు తమకు తెలియజేయాలని కోరింది. అయితే వారి ఆచూకీ తెలియలేదు. ఇప్పుడు జారీచేస్తున్న రెడ్‌కార్నర్ నోటీసు వల్ల వివిధ దేశాల్లో ఉన్న ఇంటర్‌పోల్ దర్యాప్తు సంస్థలు మోదీ ఆచూకీని సులభంగా కనుగొనే వీలుంది. వారు ఏ దేశంలో ఉన్నా ఆయా సంస్థలు అరెస్టు చేసి భారత్‌కు పంపుతాయి.
వారం క్రితం సీబీఐ దాఖలు చేసిన చార్జిషీటులో మోదీ అతని కంపెనీల ద్వారా 6,498.20 కోట్లకు ముంబయిలోని బ్రాడీహౌస్ పంజాబ్‌నేషనల్ బ్యాంకు బ్రాంచిని మోసం చేశాడని పేర్కొంది. అలాగే చోక్సీ 7080.86 కోట్ల మోసానికి పాల్పడ్డాడు. రుణాలు తీసుకున్న చోక్సీ ఐదు వేల కోట్లు ఎగవేసిన కేసును కూడా సీబీఐ దర్యాప్తు చేస్తోంది.