జాతీయ వార్తలు

పెట్రోలియం శాఖ నుంచి ఏపీకి రూ.237.53కోట్ల రాయల్టీ విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వశాఖ 2018-19 ఏడాదికిగానూ ఏపీకి రావాల్సిన రాయల్టీ బకాయిలు రూ.237.53 కోట్లను విడుదల చేసింది. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం మంత్రిత్వాశాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రానికి రావల్సిన రాయల్టీ బకాయిలు ప్రతి ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ నెలలో విడుదల చేస్తుండగా సంబంధిత అధికారులలో చర్చించి ఈ ఏడాది ముందుగానే విడుదలయ్యేలా కృషి చేసినట్టు ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాష్ వెల్లడించారు.
కేంద్ర కార్మిక శాఖ మంత్రిని కలిసిన పితాని
విశాఖపట్నంలో ఈఎస్‌ఐ ఆస్పత్రి ఏర్పాటుకు సంబంధించిన భూమిని పరిశీలించేందుకు కేంద్ర కమిటీ త్వరలో రానుందని ఏపీ కార్మిక శాఖ మంత్రి పితాని సత్యనారాయణ పేర్కొన్నారు.
గురువారం సంతోష్ కుమార్ గంగ్వార్‌ను ఢిల్లీలో కలసిన మంత్రి పితాని రాష్ట్రంలో పలు ఈఎస్‌ఐ ఆస్పత్రుల అభివృద్ధిపై చర్చించారు. పితాని మాట్లాడుతూ అమరావతి, విజయనగరం, రాజమండ్రి, కాకినాడ ఆస్పత్రుల ఏర్పాటు అప్‌గ్రెడేషన్‌పై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని చెప్పారు. విశాఖ ఈఎస్‌ఐ ఆస్పత్రి ఏర్పాటుకు సంబంధించి ప్రతిపాదిత భూమిని పరిశీలించి ఆమోదించేందుకు కార్మిక శాఖ డైరెక్టర్ జనరల్, కార్మిక శాఖ కార్యదర్శి ఆధ్వర్యంలోని కమిటీ 15 రోజుల్లో విశాఖ వచ్చి భూమిని పరిశీలిస్తుందని తెలిపారు.