అంతర్జాతీయం

పాలపుంత ముంగిట్లో మరో భారీ గ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, మార్చి 27: మన పాలపుంతలోనూ, దాని సమీపంలోని రోదసీలోనూ నిబిడీకృతమైన అద్భుతాలకు కొదవలేదు. శోధించే కొద్దీ కొత్త నక్షత్రాలు, గ్రహాలు, గెలాక్సీలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా మన పాలపుంత సమీపంలో వాయువుతో నిండిన దాదాపు శనిగ్రహ లక్షణాలు కలిగిన ఓ భారీ గ్రహాన్ని ఖగోళవేత్తలు కనిపెట్టారు. మన సౌర వ్యవస్థ ఆవల ఉన్న ఈ గ్రహం ద్రవ్యరాశి శని గ్రహానికి, గురు గ్రహానికి మధ్య పరిమాణంలో ఉంటుందని తెలిపారు. అలాగే మన సూర్యుడులో సగం ద్రవ్యరాశి కలిగిన ఓ నక్షత్రం చుట్టూ ఈ గ్రహం పరిభ్రమిస్తోందని వెల్లడించారు. గురుత్వాకర్షక మైక్రో లెన్సింగ్ టెక్నిక్ ద్వారా ఈ కొత్త గ్రహాన్ని భారత్‌కు చెందిన ఓ శాస్తవ్రేత్తతోసహా ఖగోళవేత్తల బృందం కనుగొంది. ఈ ప్రక్రియ ద్వారా ఎన్నో సరికొత్త గ్రహాలను కనిపెట్టే అవకాశం ఉందని వివరించారు.