జాతీయ వార్తలు

బలపడుతున్న సహకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 24: భారత్-నెదర్లాండ్స్ దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్య రంగాల్లో పరస్పర సహకారం బలపడుతోందని, ఇరుదేశాల అభివృద్ధికి దోహదపడే విధంగా చర్చలు జరిగాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. గురువారం ప్రధాని నరేంద్ర మోదీ, నెదర్లాండ్స్ ప్రధాన మంత్రి మార్క్ రుట్టేతో ద్వైపాక్షిక వ్యాపార సంబంధాలపై విస్తృత స్థాయిలో చర్చలు జరిపారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, వ్యవసాయ రంగాల్లో ఇరు దేశాలు పరస్పరం సహకరించుకుని సాంకేతిక పరిజ్ఞానం మార్పిడి, పెట్టుబడులను పెట్టాలని నిర్ణయించినట్లు ప్రధాని నరేంద్ర మోదీ చర్చలు అనంతరం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. భారత్ ఆర్థిక సంస్కరణలను వేగవంతం చేసిందని మోదీ పేర్కొన్నారు. వాణిజ్య అంశాలనే కాకుండా, ప్రాంతీయ, విశ్వ స్థాయిలో తలెత్తుతున్న అంశాలపై కూడా ఉభయులం చర్చించామన్నారు. క్లీన్ ఎనర్జీ, వ్యవసాయం, స్మార్ట్ సిటీల నిర్మాణంపై పెట్టుబడులు పెట్టేందుకు నెదర్లాండ్స్ ఆసక్తిగా ఉన్నట్లు నెదర్లాండ్స్ ప్రధాన మంత్రి మార్క్ రుట్టే పేర్కొన్నారు. రుట్టే ప్రధానమంత్రి అయిన తర్వాత భారత్‌కు రావడం ఇది రెండోసారి. 2015 జూన్‌లో ఆయన భారత్‌లో పర్యటించారు. రుట్టే వెంట ఉన్నత స్థాయి వాణిజ్య ప్రతినిధుల బృందం వచ్చింది. ఇంతవరకు భారత్‌లో 5.3 బిలియన్ డాలర్ల పెట్టుబడులను నెదర్లాండ్ భారత్‌లో పెట్టింది. ఈ పెట్టుబడుల పరిమాణాన్ని పెంచాలనే లక్ష్యంతో నెదర్లాండ్స్ ఉంది. 2000 నుంచి 2017 వరకు భారత్‌లో నెదర్లాండ్ 23 బిలియన్ డాలర్ల పెట్టుబడులను పెట్టింది. నెదర్లాండ్స్‌లో భారత్ సంతతికి చెందిన 2.35 లక్షల మంది నివసిస్తున్నారు. అంతకు ముందు నెదర్లాండ్స్ ప్రధాని రుట్టే ‘్భరత్ ఒక అందమైన దేశం’ అంటూ ట్వీట్ చేశారు. ఇరు దేశాల మధ్య బలమైన సంబంధాలు గత 70 ఏళ్లుగా ఉన్నాయన్నారు. ప్రధాని నరేంద్ర మోదీని వీలైనంత త్వరలో కలవాలనే ఆసక్తితో ఉన్నామని భారత్‌కు చేరుకున్న వెంటనే పేర్కొన్నారు. ఆయన భారత్‌లో రెండు రోజుల పర్యటనకు గురువారం ఉదయం ఉన్నత స్థాయి బృందంతో కలిసి చేరుకున్నారు.

చిత్రం..ఢిల్లీలో గురువారం నెదర్లాండ్స్ ప్రధాని మార్క్ రుట్టేతో కలిసి విలేఖరుల సమావేశంలో పాల్గొన్న నరేంద్ర మోదీ