జాతీయ వార్తలు

కొనసాగుతున్న ఉద్రిక్తత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్ము, మే 24: జమ్ము కాశ్మీర్‌లో అంతర్జాతీయ సరిహద్దు వెంట తొమ్మిది రోజుల పాటు విరామం లేకుండా పాకిస్తాన్ సైన్యం తుపాకుల గుళ్ల వర్షం కురిపించిన తర్వాత తుపాను ముందు ప్రశాంత వాతావరణం నెలకొంది. పాకిస్తాన్ సైన్యం ఉల్లంఘనలకు పాల్పడి ఏకపక్ష కాల్పులకు దిగిన ఘటనలో దాదాపు 11 మంది మరణించారు. 60 మందికి గాయాలయ్యాయి. తొమ్మిది రోజుల పాటు పాక్ సైన్యం ఒప్పందాలను ఉల్లంఘించి సరిహద్దును అతిక్రమించి దుశ్చర్యలకు పాల్పడింది. గత 24 గంటలుగా తుపాకుల మోత లేదు. మేము పాకిస్తాన్‌కు దీటుగా బదులిచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని బీఎస్‌ఎఫ్ అధికారి తెలిపారు. కాగా వాస్తవాధీన రేఖకు సమీపంలో రాజౌరి సెక్టార్‌లో లాం, నౌషీరా ప్రాంతంలో పాక్ బలగాలు అతిక్రమణలకు పాల్పడేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక్కడ పాక్ కాల్పుల్లో ఒక పౌరుడు మరణించగా, ఒక వ్యక్తికి గాయాలయ్యాయి. సరిహద్దు వెంట ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో ఆర్నియా వద్ద 120 ఇండ్లు ఉన్న ఒక కుగ్రామాన్ని ప్రజలు ఖాళీ చేశారు. దాదాపు సరిహద్దు వెంట ఉన్న గ్రామాల నుంచి ఒక లక్ష మంది ప్రజలు ఇండ్లను ఖాళీ చేసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిబిరాల్లో తలదాచుకుంటున్నారని ప్రభుత్వ అధికారి చెప్పారు. కథువా, సాంబ, జమ్ము జిల్లాల్లో శిబిరాల్లో ఉన్న వారికి ప్రభుత్వం అన్ని సదుపాయాలను ఏర్పాటు చేసిందన్నారు. సరిహద్దుల్లో ఉన్న ఆర్నియా పట్టణంలో నిశ్శబ్ధం రాజ్యమేలుతోంది. ఇక్కడ నుంచి 18500 మంది ప్రజలు తరలి వెళ్లారు. దొంగతనాలు జరగకుండా ఉండేందుకు కొంతమందిని గ్రామంలో కాపాలా నిమిత్తం ఉంచారు. సరిహద్దుల వెంట వ్యవసాయ పనులను నిలిపివేశారు. పాఠశాలలను మూసివేశారు. పశువులను మేత నిమిత్తం కొండల్లోకి తీసుకెళ్లడం మానివేశారు. మే 15వ తేదీ నుంచి అంతర్జాతీయ సరిహద్దుల వెంట పాక్ సైన్యం కాల్పులకు దిగింది. బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్ రైనా మాట్లాడుతూ, తాను, పార్టీ ఎంపీ జుగాల్ కిశోర్ శర్మ కలిసి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని కలిసి పరామర్శించినట్లు చెప్పారు. సరిహద్దుల వద్ద ఉద్రిక్తతలు కొనసాగే పక్షంలో తలెత్తే ఎటువంటి పరిస్థితులనైనా తట్టుకునేందుకు ముందస్తు చర్యగా అన్ని చర్యలు తీసుకుంటామని కాశ్మీర్ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఆరోగ్య, పునరావాస అధికారులు సరిహద్దుల వద్ద సాధారణ పరిస్థితులు నెలకొనేంత వరకు అక్కడే ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రామన్ భల్లా మాట్లాడుతూ పాక్ సైన్యానికి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. ప్రజల భద్రతను పర్యవేక్షించడంలో, పునరావాస చర్యలను తీసుకోవడంలో కేంద్రం విఫలమైందన్నారు. అంతర్జాతీయ సరిహద్దు, వాస్తవాధీన రేఖ వద్ద యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయని ఆయన అన్నారు.