జాతీయ వార్తలు

ఇక నో స్మార్ట్ ఫోన్స్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్: స్మార్ట్ఫోన్ల వినియోగంతో జరుగుతున్న నష్టం అంతా ఇంతా కాదని నిపుణులు ఓ వైపు హెచ్చరిస్తూనే ఉన్నారు. చివరికిది పోలీసు శాఖలోకి విస్తరించింది. విధి నిర్వహణలో ఉన్న సిబ్బంది స్మార్ట్ఫోన్ల గాడ్జెట్లతో బిజీగా ఉండడం వల్ల ఆయుధాలు పోతున్నాయని ఆరోపణలు వచ్చాయి. దీంతో డ్యూటీలో ఉండగా స్మార్ట్ఫోన్లను వాడకుండా ఆంక్షలు విధించారు. గాడ్జెట్ల వినియోగం ఓ అలవాటుగా మారిపోయిందని, వ్యక్తిగత భద్రతా సిబ్బంది, పోలీసులకు ఇది పాకిందని గమనించిన అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. జమ్మూకాశ్మీర్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు (ఏడీజీపీ) ఆర్మ్‌డ్ ఏకే చౌదరి ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు. ఇలాంటి చర్యలు పోలీసుల ప్రతిష్టకూ భంగం కలిగిస్తుందని ఆయన అన్నారు. ‘సెంట్రీలుగా ఉన్నవారు స్మార్ట్ఫోన్లతో బిజీగా గడుపుతున్నట్టు తెలిసింది. డ్యూటీ సమయంలో ఎక్కువ సేపుఫోన్లతోనే ఉంటున్నట్టు గమనించాం. దీనివల్ల ఆయుధాల పోగొట్టుకోవడం, సహచర ఉద్యోగి హత్యలకు గురవ్వడం జరుగుతోంది. ముఖ్యంగా కాశ్మీర్ లోయలో స్మార్ట్ఫోన్ల ప్రభావం ఎక్కువగా ఉన్నట్టు తేలింది’ అని చౌదరి స్పష్టం చేశారు. దీన్ని చూసీ చూడనట్టు వదిలేస్తే మరింత ప్రమాదమని భావించి ఆంక్షలు విధించాల్సి వచ్చిందని ఏడీజీపీ వెల్లడించారు. పైగా పోలీసు శాఖ పనితీరునే ప్రశ్నించే అవకాశం అవకాశం ఏర్పడుతుందని ఆయన అన్నారు. పైస్థాయిలో అజమాయిషీ, పర్యవేక్షణ లేకపోవడం వల్ల కిందిస్థాయి సిబ్బంది క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడే అవకాశం ఉందని అధికారి తెలిపారు. ఈ వాస్తవాలన్నీ పరిశీలించిన తరువాతే నిర్ణయం తీసుకోవల్సి వచ్చిందని చౌదరి పేర్కొన్నారు. ‘ఏ ఒక్క సెంట్రీ కూడా డ్యూటీకి వచ్చేటప్పుడు స్మార్ట్ఫోన్ తెచ్చుకోకూడదు. విధి నిర్వహణలో ఉండగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఫోన్లను వాడకూడదు’ అని ఆదేశించారు. గార్డు డ్యూటీలో ఉండగా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్, వారికి కేటాయించిన ఆయుధం, సామగ్రిని అత్యంత భద్రంగా కాపాడుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అలాగే అలారం సిస్టమ్ పక్కాగా ఉండాలని, యూనిట్ డ్యూటీ ఆఫీసర్లు ఎప్పటికప్పుడు కమాండర్లకు సమాచారం అందిస్తూ ఉండాలని ఆయన ఆదేశించారు.