జాతీయ వార్తలు

40నిమిషాల్లో ఢిల్లీ నుంచి మీరట్‌కు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూ ఢిల్లీ: యుపిలో సోమవారం కైరానా అసెంబ్లీకి ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను ఆదివారం బాగ్‌పట్‌లో ప్రారంభించారు. ఢిల్లీ నుంచి మీరట్‌కు ప్రయాణించే సమయం తగ్గించేందుకు వీలు కల్పించే విధంగా ఎక్స్‌ప్రెస్ వే, మరొకటి ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించేందుకు నిర్మించేందుకు రహదారిని ప్రారంభించారు. ఉప ఎన్నిక నేపథ్యంలో రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నియోజకవర్గం బాగ్‌పట్‌కు సమీపంలో ఉంది. ఈ నేపథ్యంలో బాగ్‌పట్‌లో జరిగిన సభలో ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్ హైవేకు రూ.7500 కోట్లను ఖర్చుపెట్టారు. 14 లైన్ల రహదారి నిర్మాణం వల్ల ఢిల్లీ నుంచి మీరట్‌కు 40 నిమిషాల్లో చేరుకోవచ్చు. గతంలో ఈ రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం రెండన్నర గంటలు ఉండేది. కాగా ఢిల్లీలో కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించే విధంగా రూ.11వేల కోట్లతో ఈస్ట్రన్ పెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్ హైవేను నిర్మించారు. జమ్ముకాశ్మీర్‌వైపు రోజు 50 వేల వాహనాలు కొత్త మార్గం ద్వారా వెళ్లవచ్చు. 17 నెలల్లో ఈ ప్రాజెక్టును నిర్మించారు.
ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్ హైవే పైన మోదీ 9 కి.మీ ప్రయాణించారు. ఈ సందర్భంగా రోడ్డు పక్కన ఉన్న ప్రజలకు అభివాదం చేశారు. ఢిల్లీ మీరట్ హైవేలో ప్రస్తుతం 31 సిగ్నల్స్ ఉన్నాయి. వీటివల్ల ట్రాఫిక్‌కు తరచుగా అంతరాయం కలుగుతోంది. కొత్త మార్గం వల్ల ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది. కాగా బాగ్‌పట్ సభలో ప్రధాని చేసిన ప్రసంగం ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించే విధంగా ఉందంటూ విపక్ష పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు కూడా చేశాయి.

చిత్రం..ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్ హైవే ప్రాజెక్టు వివరాలు తెలుసుకుంటున్న ప్రధాని నరేంద్ర మోదీ.
చిత్రంలో కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, మన్‌షుల్ ఎల్. మాండవీయ తదితరులు