జాతీయ వార్తలు

మూడో వర్గం కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 30: స్వలింగ సంపర్కులను మూడో వర్గంకిందికి రారని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. హిజ్రాలను మాత్రమే మూడోవర్గంగా పరిగణించాలని కూడా తేల్చి చెప్పింది. హిజ్రాలకు సంబంధించి 2014 ఏప్రిల్‌లో ఇచ్చిన తీర్పును సవరించడానికి సైతం న్యాయమూర్తులు ఎకె సిక్రీ, ఎన్‌వి రమణలతో కూడిన ధర్మాసనం నిరాకరించింది. ఇంతకు ముందు సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పులో స్వలింగ సంపర్కులు మూడో వర్గానికి చెందినవారో కాదో స్పష్టంగా తెలియలేదని కేంద్ర ప్రభుత్వం తరఫున వాదించిన అదనపుసొలిసిటర్ జనరల్ మనిందర్ సింగ్ అన్నారు. అయితే ఈ విషయంలో స్పష్టత అవసరమనే కారణంతో కేంద్ర ప్రభుత్వం గత రెండేళ్లుగా హిజ్రాలకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలుచేయడం లేదని హిజ్రాల హక్కులకోసం పోరాడే ఉద్యమకారుల తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది ఆనంద్ గ్రోవర్ చెప్పారు. దీంతో దీనికి సంబంధించి ఎలాంటి వివరణా ఇవ్వాల్సిన అవసరం లేదంటూ కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు గురువారం ఈ పిటిషన్‌ను విచారించిన బెంచ్ తెలిపింది. 2014 ఏప్రిల్ 15న ట్రాన్స్‌జెండర్స్ లేదా హిజ్రాలను మూడోవర్గంగా గుర్తిస్తూ తీర్పు చెప్పిన సుప్రీంకోర్టు వారిని సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడినవర్గంగా గుర్తిస్తూ విద్యా సంస్థల్లో ప్రవేశాలు, ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్లు కల్పించాలని కేంద్రాన్ని ఆదేశించింది. అయితే ట్రాన్స్‌జండర్ అనే దానిపై స్పష్టత ఇవ్వాలని కోరుతూ అదే ఏడాది సెప్టెంబర్‌లో కేంద్రం పిటిషన్ దాఖలు చేసింది. తన తీర్పులో ఎలాంటి సందగ్ధత లేదని, లెస్బియన్లు, గేలు, బై సెక్సువల్స్ ట్రాన్స్‌జండర్ల కిందికి రారని చాలా స్పష్టంగా చెప్తున్నామని బెంచ్ స్పష్టం చేసింది.