జాతీయ వార్తలు

2019 ఎన్నికల సంకీర్ణంలో కాంగ్రెస్సే కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 27: వచ్చే 2019 ఎన్నికల్లో బీజేపీయేతర పార్టీలన్నీ కలిసి బీజేపీని అధికారంలోకి రాకుండా తీవ్రంగా కృషి చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సచిన్ పైలట్ కోరారు. ఇటీవల కర్నాటకలో జరిగిన పరిణామాలను ఆయన ఉదహరిస్తూ బీజేపీకి బుద్ధిచెప్పడానికి ఏర్పడే సంకీర్ణంలో కాంగ్రెస్‌దే ప్రధాన భూమిక అని పేర్కొన్నారు. ఈ సంవత్సరంలో జరిగి రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పూర్తి విజయం సాధిస్తుందన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాకూడదన్న బీజేపీయేతర పార్టీల కృతనిశ్చయానికి తాము సంపూర్ణ మద్దతు ఇస్తామని ఆయన చెప్పారు. కమలం పార్టీని మట్టికరిపించే సత్తా కాంగ్రెస్‌కే ఉందని అన్నారు. సైద్ధాంతికపరంగా కొన్ని విభేదాలు ఉన్నా అన్ని పార్టీలు సంకీర్ణం కావాల్సిన అవసరం ఇటీవల బెంగళూరులో జరిగిన కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రమాణ స్వీకారం సందర్భంగా జరిగిన పరిణామాలు చాటిచెప్పాయని ఆయన అన్నారు. రాహుల్‌గాంధీని సంకీర్ణ నేతగా నామినేట్ చేయడానికేనా ఈ ప్రయత్నాలు అన్న ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ సంకీర్ణానికి ఎవరైనా నాయకత్వం వహించవచ్చునని, అయితే ఇప్పటికే ప్రజావిశ్వాసం కోల్పోయిన బీజేపీని దింపడానికి అందరూ కలిసి పనిచేయాల్సిన సమయం వచ్చిందని అన్నారు. ఇప్పుడేర్పడే ఫ్రంట్‌కు రాహుల్‌గాంధీ నాయకత్వం వహిస్తారా అని నరేంద్ర మోదీ, అమిత్‌షాలు ప్రశ్నిస్తున్నారని, కాంగ్రెస్ ఎన్నడూ దీనిని ప్రస్తావించదని, ఒకవేళ తమ పార్టీపరంగా సమాధానం ఇవ్వాల్సి వస్తే అవునని సమాధానం చెబుతామని అన్నారు. బీజేపీకి సవాల్ విసరగలిగే ఏకైక పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. అయితే సంకీర్ణం ఏర్పడుతుందా, ఏర్పడదా అని అని ఇప్పుడే సమాధానం చెప్పడం తొందరపాటే అవుతుందని, బెంగళూరు పరిణామాల నేపథ్యంలో సంకీర్ణం ఏర్పడటానికి పూర్తి అవకాశాలు మాత్రం ఉన్నాయని సచిన్ పైలట్ స్పష్టం చేశారు. దీనిపై ఇప్పటికే ప్రయత్నాలు జరుగుతున్నాయని, తమ నాయకురాలు సోనియాగాంధీ 17 పార్టీల వారితో న్యూఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. రాజస్థాన్‌లోని వసుంధరరాజేను ఓడించి చారిత్రక విజయాన్ని సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వం మీద ప్రజలకు ఉన్న వ్యతిరేకతే చత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో కాంగ్రెస్ పార్టీ విజయానికి దోహదం చేస్తుందని అన్నారు.

చిత్రం..కాంగ్రెస్ సీనియర్ నేత సచిన్ పైలట్