జాతీయ వార్తలు

చరిత్రను ఏమార్చలేం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: చారిత్రక వాస్తవాలను వక్రీకరిస్తూ చరిత్రనే తిరగరాసే ‘కొత్త సృష్టికర్తల’ ప్రయత్నాలేవీ ఫలించవని మాజీ ఉప రాష్టప్రతి హమీద్ అన్సారీ అన్నారు. మార్చడానికి సాధ్యంకానిదే చరిత్ర అని స్పష్టం చేశారు. సీనియర్ కాంగ్రెస్ నేత ఏ గోపన్న సంపాదకీయంలో తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ పై వచ్చిన పుస్తకాన్ని మాజీ రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో అన్సారీ మాట్లాడుతూ అప్పుడెప్పుడో ‘టైం మెషీన్’ అనే పుస్తకం వచ్చింది. ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఒక యంత్రంలో కూర్చుని కాలానికి ముందూ, వెనకకు ప్రయాణించవచ్చన్నది అందులోని ప్రధాన ఆలోచన. అప్పట్లో ఆ పుస్తకం ఎం తో విజయం సాధించింది. కానీ, ఇప్పుడు ఓ రకం సృష్టికర్తలు వస్తున్నారు. వాళ్లే ఓ టైం మెషీన్‌ను సిద్ధం చేసి కాలంలో వెనక్కి ప్రయాణించి ‘చరిత్రను తిరగరాస్తున్నారు’. అలాంటివాళ్ల ప్రయత్నాలేమీ ముందుకు సాగవు. ఎందుకంటే, అది చరిత్ర కనుక’ అన్నారు. ‘చరిత్రను చదువుకోవాలి. దానినుంచి పాఠాలు నేర్చుకోవా లి. స్ఫూర్తిపొందాలి. ఒక్కముక్కలో చెప్పాలంటే కళాశాల విద్యార్థి టెర్మ్ పరీక్షలకు చదువుకున్నట్టు చదువుకోవాలి. అంతేగాని మార్చే వృధా ప్రయత్నాన్ని చేయకూడదు’ అని హితవు పలికారు. ‘చరిత్రను ఎవ్వరూ మార్చలేరు, ఏమార్చలేరు’ అని అన్సారీ వ్యాఖ్యానించారు. ఎన్డీయేపై విపక్ష కాంగ్రెస్ విరుచుకుపడే ప్రతిసారీ ‘చరిత్ర పునరావృతం’ అవుతోందంటూ చేస్తున్న వ్యాఖ్యలను పరోక్షంగా ప్రస్తావించినట్టుగా అన్సారీ వ్యాఖ్యలు ఉన్నాయి. నెహ్రూపై వచ్చిన పుస్తకం గు రించి మాట్లాడుతూ ‘విలువైన అక్షర సంపద’గా అభివర్ణించారు. దేశ స్వాతంత్య్ర పోరాటాన్ని గొప్ప నాయకుడు నడిపించిన తీరు, వివిధ దశలో అభివద్ధి చెందిన భారతంలాంటి ఎన్నో గొప్ప విషయాలు ఈ పస్తకం ద్వారా తెలుసుకోవచ్చన్నారు. మాజీ రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ మాట్లాడుతూ ‘నెహ్రూ గురించి ఎన్ని గొప్ప విషయాలు మాట్లాడుకున్నా తరగవని, దశలవారీ నవభారతం పుస్తకంలో గోచరిస్తుంది’ అని వ్యాఖ్యానించారు. ‘ఆధునిక భారత చరిత్రలో కొంతమందితో అనుసంధానమై కనిపిస్తుంది. అలాంటి వ్యక్తుల్లో నెహ్రూ ఒకరు. ఎందుకూ అంటే ఆయన భారత తొలి ప్రధాని అన్నారు. అంతేకాదు, దేశానికి పదిహేడేళ్లపాటు అప్రతిహత ప్రధానిగా సేవలు అందించిన గొప్ప వ్యక్తి ఆయ నే. ఆ రికార్డును ఎవ్వరూ చేరుకోలేదు’ అని ప్రణబ్ కీ ర్తించారు. ‘54 ఏళ్ల క్రితం మనం ఆయనను కోల్పో యాం. అయినా ఆయనే గొప్పవాడు. ఎందుకంటే, భారత ఆధునిక ప్రజాస్వామ్య రూపకర్త ఆయన’ అని ప్రశంసించారు. ప్రజాస్వామ్య నిర్మాణ పునాధులు బలంగా ఉండేందుకు ఎన్నో కేంద్రాలకు ఆయన ప్రాణం పోశారు’ అని ముఖర్జీ నివాళి ప్రకటించారు.
సీనియర్ కాంగ్రెస్ నేత ఏ గోపన్న సంపాదకీయంతో జవహర్‌లాల్ నెహ్రూ పై వెలువడిన పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న మాజీ చిత్రం..రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ. చిత్రంలో మాజీ ఉప రాష్టప్రతి హమీద్ అన్సారీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్