జాతీయ వార్తలు

8న హాజరుకండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 30: ‘అత్యాచారం’ విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి దేశవ్యాప్తంగా విమర్శలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌కు జాతీయ మహిళా కమిషన్ తాజాగా సమన్లు పంపింది. తన వ్యాఖ్యల విషయంలో సల్మాన్ ఇచ్చిన వివరణ ఏమాత్రం సంతృప్తికరంగా లేదని, దీని దృష్ట్యా జూలై 8న తమముందు హాజరుకావాలని ఆదేశించింది. సమన్లను ఖాతరు చేయని పక్షంలో చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించింది. ‘సుల్తాన్’ షూటింగ్ సన్నివేశానికి సంబంధించి సల్మాన్ చేసిన వ్యాఖ్యలు దుమారం లేపాయి. వీటిపై వివరణ ఇవ్వాలంటూ మహారాష్ట్ర మహిళా కమిషన్ సమన్లు పంపింది. వాటిని ఆయన పట్టించుకోకపోవడంతో జూలై 7న తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది. దేశవ్యాప్తంగా అలజడి రేకెత్తిస్తున్న వ్యాఖ్యలపై ఏమాత్రం పశ్చాత్తాపపడని ధోరణి సల్మాన్‌లో కనిపిస్తోందని మహిళా కమిషన్ పేర్కొంది.