జాతీయ వార్తలు

మూల్యం చెల్లించుకోక తప్పదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 30: ఉగ్రవాదానికి ఆశ్రయమిస్తూ పెంచిపోషిస్తున్న దేశాలు మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ హెచ్చరించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచ దేశాలు ఐక్యంగా పోరాడాలని ఆమె పిలుపునిచ్చారు. గురువారం ఇక్కడ ఆమె బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణ కొరియా) యువజన శిఖరాగ్ర సమావేశంలో మాట్లాడుతూ ఉగ్రవాదాన్ని మంచి ఉగ్రవాదం, చెడు ఉగ్రవాదం అని విభజించకుండా మొత్తం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచ దేశాల సంఘటిత పోరాటం ఉండాలని సూచించారు. వాతావరణ మార్పు, పేదరిక నిర్మూలన, అవినీతి వంటి సవాళ్లను ప్రధానంగా ఎదుర్కోవడానికి ఏర్పడిన బ్రిక్స్ ఉగ్రవాద నిర్మూలనకు కూడా కృషి చేయాలని సుష్మా స్వరాజ్ పిలుపునిచ్చారు. మనమంతా కలిసి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడవలసిన అవసరం ఉందని, అంతర్జాతీయ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా బ్రిక్స్, ఐక్యరాజ్య సమితి (ఐరాస) భద్రతా మండలి, ఇతర అనేక కమిటీలలో కలిసి పనిచేయవలసిన అవసరం ఉందని ఆమె అన్నారు. మానవత్వంపై దాడి చేస్తున్న ఏ ఉగ్రవాది అయినా ఉగ్రవాదేనని, ఉగ్రవాదుల్లో మంచి వారు అంటూ ఎవరూ ఉండరని ఆమె పేర్కొన్నారు. ప్రపంచంలోని 42 శాతం జనాభాను కలిగి ఉన్న అయిదు దేశాలతో కూడిన ప్రభావవంతమైన బ్రిక్స్‌కు సారథ్య దేశంగా భారత్ బ్రిక్స్ ఎనిమిదో వార్షిక శిఖరాగ్ర సమావేశాలను అక్టోబర్‌లో గోవాలో నిర్వహిస్తుందని ఆమె వెల్లడించారు. ఐరాస భద్రతా మండలిని త్వరితగతిన సంస్కరించడానికి మనమంతా కలిసి పనిచేయవలసి ఉందని మంత్రి బ్రిక్స్ దేశాలకు సూచించారు. 21వ శతాబ్దం అవసరాలను తీర్చేవిధంగా ఐరాస భద్రతా మండలిని తీర్చిదిద్దవలసిన అవసరం ఉందన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో బ్రిక్స్ మరపురాని విజయాలను సాధించిందని సుష్మా స్వరాజ్ తెలిపారు. భారత్‌లోని 800 మిలియన్ల మంది పౌరులు 35 ఏళ్లలోపు వారేనని ప్రపంచంలో భారత్‌ను వేగంగా వృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడంలో ఛోదకశక్తులు వీరేనని వివరించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీలో మీరు అతిపెద్ద యువ చాంపియన్‌ను చూస్తారని అన్నారు.

చిత్రం..బ్రిక్స్ యువజన శిఖరాగ్ర సమావేశాలకు హాజరైన డెలిగేట్స్‌తో సుష్మా స్వరాజ్