జాతీయ వార్తలు

యుపిలో కాంగ్రెస్ ఐదంచెల వ్యూహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 30: ఉత్తరప్రదేశ్ శాసనసభకు వచ్చే సంవత్సరం జరిగే ఎన్నికలను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ ఐదు సూత్రాల వ్యూహాన్ని సిద్ధం చేసుకున్నది. ఐదు సూత్రాలను అమలు చేయటంతోపాటు ప్రియాంక గాంధీని సరైన సమయంలో రంగంలోకి దించటం ద్వారా యుపి అసెంబ్లీ ఎన్నికల్లో తమ సత్తాను చాటుకోవాలని కాంగ్రెస్ అధినాయకత్వం ఆలోచిస్తోంది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు పార్టీని సిద్ధం చేసేందుకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నియమించిన ఎన్నికల నిపుణుడు ప్రశాంత్ కిశోర్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటించిన అనంతరం రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాంనబీ ఆజాద్‌తో కలిసి ఈ ఐదు సూత్రాల పథకాన్ని తయారు చేసినట్లు తెలిసింది. ఐదు సూత్రాల పథకం ప్రకారం ప్రియాంక గాంధీ అసెంబ్లీ ఎన్నికల కోసం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం చేస్తారు.
కాంగ్రెస్ టికెట్‌ను ఆశించే ప్రతి అభ్యర్థి తాను పోటీ చేయాలనుకుంటున్న అసెంబ్లీ నియోజకవర్గంలోని ప్రతి పోలింగ్ కేంద్ర ప్రాంతానికి చెందిన ఇద్దరు పార్టీ కార్యకర్తల పేర్లతో ఒక జాబితాను జత చేయవలసి ఉంటుంది. ఉత్తరప్రదేశ్‌లోని శాసన సభ నియోజకవర్గాల్లో మూడు వందల నుండి ఐదు వందల వరకు పోలింగ్ కేంద్రాలుంటాయి. పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ముందే ప్రకటిస్తారు. పార్టీ టికెట్ లభించిన అభ్యర్థి నియోజకవర్గంలోని ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం చేయవలసి ఉంటుంది. రాష్ట్ర కాంగ్రెస్ ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ వ్యవస్థను పటిష్ఠం చేయటంతోపాటు ఎన్నికల ప్రచారం కోసం సమర్థవంతమైన యంత్రాంగాన్ని సిద్ధం చేయవలసి ఉంటుంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికల ప్రచార కమిటీని జిల్లా, రాష్ట్ర స్థాయి ఎన్నికల కమిటీతో అనుసంధాన చేస్తారు. రాష్ట్ర స్థాయి కమిటీ జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గం స్థాయి పార్టీ ప్రచారాన్ని ఎప్పటికప్పుడు సమన్వయం చేయటంతోపాటు అవసరానికి అనుగుణంగా ప్రచార సామాగ్రి, సమాచారం, ప్రచార పాయింట్లను కిందిస్థాయికి అందజేస్తుంది. అసెంబ్లీ ఎన్నికల కోసం జూలై నెల నుండే ప్రచారం ప్రారంభించాలని నిర్ణయించారు. పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక విషయంలో అత్యంత జాగరూకతతో వ్యవహరిస్తారు. పార్టీ కోసం పని చేయటంతోపాటు ప్రజల్లో పలుకుబడి ఉన్న వారికి మాత్రమే టికెట్లు కేటాయిస్తారు. ప్రజలతో సంబంధం లేని వారిని ఎటువంటి పరిస్థితిలో కూడా ఎన్నికల బరిలోకి దించకూడదని నిర్ణయించారు. రాష్ట్ర స్థాయి ఎన్నికల ప్రచారం పూర్తి బాధ్యతలు గులాం నబీ ఆజాద్, ప్రశాంత్ కిశోర్ నిర్వహస్తారు.
యుపి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రియాంక చేత విస్తృతంగా ప్రచారం చేయించాలని పార్టీ అధినాయకత్వం భావిస్తోంది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎలాగూ ప్రచారం చేస్తారు. అయితే ప్రియాంక గాంధీని ప్రత్యేక నాయకురాలిగా ఎన్నికల ప్రచార బరిలోకి దించాలని కాంగ్రెస్ అధినాయకత్వం భావిస్తోంది. ప్రియాంక ఇంతకాలం అమేథీ, రాయబరేలీ లోక్‌సభ నియోజవర్గాల్లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీల కోసం మాత్రమే ఎన్నికల ప్రచారం చేసేవారు. ఇప్పుడు పార్టీ అభ్యర్థులందరి కోసం ఆమె చేత ఎన్నికల ప్రచారం చేయించాలనుకుంటున్నారు. ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీలో నాలుగు వందల నాలుగు నియోజకవర్గాలుంటే ఇందులో మెజారిటీ నియోజకవర్గాల్లో ప్రియాంకా గాంధీ పర్యటించేలా వ్యూహాన్ని ఖరారు చేస్తున్నట్లు తెలిసింది.