జాతీయ వార్తలు

అభివృద్ధి చెందిన దేశాల వల్లే కాలుష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 2: అభివృద్ధి చెందుతున్న దేశాలకంటేౄ అభివృద్ధి చెందిన దేశాలు ఎక్కువ కర్బన ఉద్గారాలను వదిలిపెడుతున్నాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాకూర్ అన్నారు. మానవ హక్కులను, పర్యావరణాన్ని పరిరక్షించడానికి పటిష్ఠమైన అంతర్జాతీయ చట్టం ఆయుధంగా పని చేస్తుందని కూడా అన్నారు. ప్రపంచవ్యాప్తంగా అధికార పరిధులకు సంబంధించి ఘర్షణలు నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో నదీ జలాలు, రోదసీ చట్టం, శరణార్థుల చట్టం లాంటి వివాదాల పరిష్కారానికి మనమంతా సన్నద్ధం కావాలని శనివారం ఇక్కడ ఇంటర్నేషనల్ లా అసోసియేషన్ సదస్సులో మాట్లాడుతూ ఠాకూర్ అన్నారు. ఇప్పుడు ఓజోన్ పొర తగ్గిపోతూ ఉందంటే భారత్ ఒక అర్థిక శక్తిగా ఎదుగుతున్నందువల్లనో లేదా తన విద్యుత్ అవసరాలకు అది బొగ్గుపై ఆధారపడుతున్నందువల్లనో కాదని, గత 200 సంవత్సరాలుగా పారిశ్రామిక దేశాలు కాలుష్యాలను వెదజల్లుతున్నందువల్లనేనని ఆయన చెప్పారు.