జాతీయ వార్తలు

జమిలికి అడుగు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 24: మధ్యప్రదేశ్, రాజస్తాన్, చత్తీస్‌గఢ్, మిజోరం శాసన సభ ఎన్నికల సమయంలోనే లోక్‌సభ ఎన్నికలను కూడా నిర్వహించడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. అయితే అందరు అంచనా వేస్తున్నట్లు నాలుగు రాష్ట్రాల శాసనసభల ఎన్నికలతోపాటు లోక్‌సభ ఎన్నికలు నిర్వహించకుండా, అంతకంటే ముందుగానే, మధ్యప్రదేశ్‌సహా మొత్తం నాలుగు రాష్ట్రాలకు జరిగే అసెంబ్లీ ఎన్నికలతో నాలుగు శాసనసభల ఎన్నికలను కలపాలని మోదీ ఆలోచిస్తున్నట్లు తెలిసింది. ఇలా చేయటం వలన లోక్‌సభతోపాటు పదకొండు రాష్ట్రాల శాసన సభల ఎన్నికలు జరిగి, ఒక రకంగా జమిలి ఎన్నికలకు మొదట అడుగు పడినట్లు అవుతుందని మోదీ అలోచనగా చెప్తున్నారు. లోక్‌సభతోపాటు దేశంలోని అన్ని రాష్ట్రాలకూ శాసనసభ ఎన్నికలు ఒకేసారి జరగాలని మోదీ చాలా కాలం నుండి అంటున్న విషయం తెలిసిందే. లోక్‌సభ, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి అంటే జమిలి ఎన్నికల జరపటం మంచిదని ఆయన వాదన. లోక్‌సభకు వచ్చే సంవత్సరం మార్చి, ఏప్రిల్‌లో ఎన్నికలు జరుగవలసి ఉన్నది. దీనితోపాటు నాలుగు రాష్ట్రాల శాసనసభల ఎన్నికలు జరిపేలా చూసేందుకు మోదీ కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తున్నది. మధ్యప్రదేశ్ తదితర నాలుగు రాష్ట్రాల శాసన సభల గడువు ముగిసిన అనంతరం రాష్టప్రతి పాలన విధించి, నాలుగైదు నెలల తరువాత లోక్‌సభతోపాటు కలిపి ఎన్నికలు జరిపితే ఎలా ఉంటుందనే ప్రతిపాదన మోదీ పరిశీలనలో ఉన్నదని బీజేపీ వర్గాలు అంటున్నాయి. నాలుగు రాష్ట్రాల శాసనసభల ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలైతే, ఆ తరువాత జరిగే లోక్‌సభ ఎన్నికలపై దాని ప్రభావం తీవ్రంగా ఉంటుందనేది వాస్తవం. నాలుగు రాష్ట్రాల శాసనసభలతో కలిపి చేయాలనుకుంటే లోక్‌సభకు ముందస్తు ఎన్నికలు జరపవలసి ఉంటుంది. అదే జరిగితే తనకు చెడ్డపేరు వస్తుందని మోదీ భావిస్తున్నట్టు తెలిసింది. అందుకే నాలుగు రాష్ట్రాల శాసన సభల ఎన్నికల ప్రభావం లోక్‌సభ ఎన్నికలపై ఉండకుండా చూసేందుకు ఒకేసారి ఎన్నికలకు వెళ్లాలనే వ్యూహరచన చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ రాష్ట్రాల శాసన సభల ఎన్నికలను లోక్‌సభ ఎన్నికల వరకూ వాయిదా వేయటమే ఉత్తమని
ప్రధానితోపాటు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కూడా భావిస్తున్నారని అంటున్నారు. మధ్యప్రదేశ్,
రాజస్తాన్, చత్తీస్‌గఢ్‌లో బీజేపీ అధికారంలో ఉన్నందున, అక్కడ నాలుగు నెలల పాటు రాష్టప్రతి పాలన విధించినా పెద్దగా సమస్య ఉండదని పార్టీ అధినాయకత్వం అంచనా వేస్తోంది. లోక్‌సభతోపాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఓడిశా మరి కొన్ని రాష్ట్రాల శాసన సభల ఎన్నికలు జరుగవలసి ఉన్నది. మధ్యప్రదేశ్ తదితర నాలుగు రాష్ట్రాల శాసన సభల ఎన్నికలను వాయిదా వేయగలిగితే, అప్పుడు లోక్‌సభతోపాటు పదకొండు రాష్ట్రాల శాసన సభల ఎన్నికలు నిర్వహించినట్లు అవుతుంది. ఇది ఒక రకంగా జమిలి ఎన్నికల సిద్ధాంతానికి బాగా కలిసి వస్తుందని మోదీ ఆలోచిస్తున్నట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. మధ్యప్రదేశ్ తదితర నాలుగు రాష్ట్రాల శాసన సభల ఎన్నికలు ఈ సంవత్సరాంతలో జరిగి, బీజేపీ ఓడితే ఈ పరిణామం ప్రతిపక్షానికి బాగా కలిసి వస్తుంది. ఉత్తర ప్రదేశ్, బీహార్, రాజస్తాన్‌లో ఇటీవల జరిగిన ఉపఎన్నికల్లో ప్రతిపక్షాలు సమైక్యంగా పోటీ చేసి తమ సత్తాను చాటుకున్నాయి. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు ఏకం కావటం వలన ఉత్తర ప్రదేశ్, బిహార్ రాష్ట్రంలో బీజేపీకి బాగా దెబ్బ తగిలింది. ప్రాంతీయ పార్టీల ఇక మీదట కూడా ఇలాగే సమైక్యంగా పోటీ చేస్తే పార్టీ విజయావకాశాలు బాగా దెబ్బతింటాయి. రాజస్తాన్‌లో బీజేపీ పరిస్థితి అత్యంత దయానీయంగా ఉంది. ముఖ్యమంత్రి సింధియా వ్యవహారం శైలి కారణంగా పార్టీ బాగా నష్టపోయింది. మధ్యప్రదేశ్‌లో కూడా బీజేపీ పరిస్థితి అంతంత మాత్రమే. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు దిగ్విజయ్ సింగ్ ఇటీవల జరిపిన నర్మదా పరిక్రమ యాత్ర మూలంగా పార్టీ బాగా పుంజుకున్నది. దీనికితోడు పీసీసీ అధ్యక్షుడు కమల్‌నాథ్, లోక్‌సభలో కాంగ్రెస్ చీఫ్‌విప్ జ్యోతిరాదిత్య సింధియా పార్టీ విజయం కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ రెండు రాష్ట్రాల శాసన సభ ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలైతే లోక్‌సభ ఎన్నికల్లో పార్టీకి బాగా నష్టం కలుగుతుంది. ఈ ఆలోచనలతోనే, ఈ నాలుగు రాష్ట్రాల శాసన సభ ఎన్నికలను వచ్చే సంవత్సరం లోక్‌సభతోపాటు కలిపి నిర్వహించటం మంచిదని బీజేపీ అధినాయకత్వం భావిస్తోందని సమాచారం.