అంతర్జాతీయం

అలాస్కా, వాషింగ్టన్ రాష్ట్రాల్లో హిల్లరీకి ఎదురుదెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, మార్చి 27: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్న డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థుల్లో అందరికంటే ముందున్న విదేశాంగ శాఖ మాజీ మంత్రి హిల్లరీ క్లింటన్ (68)కు అలాస్కా, వాషింగ్టన్ రాష్ట్రాల్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. డెమోక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థిని ఎంపిక చేసేందుకు అక్కడ నిర్వహించిన ప్రైమరీ ఎన్నికల్లో బెర్నీ శాండర్స్ (74) ఘన విజయం సాధించి హిల్లరీ క్లింటన్ జోరుకు బ్రేకులు వేశారు. వాషింగ్టన్‌లో పోలైన మొత్తం ప్రతినిధుల ఓట్లలో 72 శాతానికి పైగా ఓట్లను గెలుచుకున్న శాండర్స్ అలాస్కాలో 80 శాతానికి పైగా ప్రతినిధుల ఓట్లను కైవసం చేసుకుని ఘన విజయం సాధించారు. ఇప్పటివరకూ ప్రైమరీ ఎన్నికలు ముగిసిన రాష్ట్రాల్లో మొత్తం మీద హిల్లరీ క్లింటన్ అత్యధిక సంఖ్యలో ప్రతినిధుల ఓట్లను రాబట్టుకుని డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థుల్లో అందరికంటే ఎంతో ముందంజలో ఉన్నప్పటికీ కీలకమైన వాషింగ్టన్ రాష్ట్రంలో ఓటమి పాలవడం ఆమెకు పెద్ద ఎదురుదెబ్బగా చెప్పవచ్చు. బోయింగ్, మైక్రోసాఫ్ట్, స్టార్‌బక్స్ తదితర అమెరికా దిగ్గజ సంస్థలకు పుట్టినిల్లుగా ఉన్న వాషింగ్టన్ రాష్ట్రంలో 100 మందికి పైగా ప్రతినిధులు ఉండగా, వారిలో అత్యధికులు శాండర్స్‌కు మద్దతు పలికారు. దీంతో వాషింగ్టన్‌లో ఘనవిజయం సాధించిన శాండర్స్ ఇప్పుడు తులసీ గబ్బార్డ్ మద్దతుతో హవాయిలో మూడో విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అమెరికా పార్లమెంట్‌కు ఎన్నికైన తొలి హిందువుగా చరిత్రకెక్కిన తులసీ గబ్బార్డ్ డెమోక్రటిక్ పార్టీలో ఉన్నత స్థాయి పదవికి రాజీనామా చేసి బెర్నీ శాండర్స్‌కు మద్దతు తెలపడంతోపాటు ఆయన తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.