జాతీయ వార్తలు

ప్రపంచవ్యాప్తంగా గురుగోవింద్ జయంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 3: చరిత్రను మరిచిపోయేవారు చరిత్రను సృష్టించలేరని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సిక్కుల చివరి గురువు గురుగోవింద్ సింగ్ 350 జయంతి ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తామని, ఇందుకోసం వంద కోట్లు కేటాయిస్తామని మోదీ తెలిపారు. సిక్కు జనరల్ బాబా బందా సింగ్ 300 వర్ధంతి సందర్భంగా ఆదివారం ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఓ సంస్మరణ కార్యక్రమంలో మోదీ మాట్లాడారు. గురుగోవింద్ సింగ్ 350 జయంతి వేడుకల్ని భారత్‌లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు నివసించే అన్ని దేశాల్లోనూ నిర్వహిస్తామని, ఇందుకోసం ఓ ఉన్నత స్థాయి కమిటీనీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. పంజాబ్ ప్రభుత్వం కూడా ఈ కార్యక్రమ నిర్వహణ కోసం వంద కోట్ల రూపాయలు అందిస్తుందన్నారు. గురుగోవింద్ సింగ్ జయంతి, బాబా బందాసింగ్ వర్థంతిని నిర్వహించుకోవడం వల్ల మన చారిత్రక పునాదుల గురించి తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. వీటన్నింటి వల్ల చారిత్రక సంప్రదాయాలనూ అవగతం చేసుకునేందుక వీలుకలుగుతుందని చెప్పారు. జో బోలో సో నిహాల్ అంటూ పలు పంజాబీ మాటల్ని వల్లించిన మోదీ సిక్కు జనరల్ బాబా బందా సింగ్ పాలనా సామర్థ్యాన్ని విశే్లషించారు. స్వేచ్ఛ, స్వామ్యవాదాలు ఆయన పరిరక్షించారని గుర్తు చేశారు. గురుశిష్యుల సంబంధాలకు గురు గోవింద్ సింగ్ నిరుపమాన నిదర్శనమన్నారు.

చిత్రం.. సిక్కు జనరల్ భాబా బందా సింగ్ 300 వర్ధంతి సందర్భంగా ఆదివారం ఢిల్లీలో జరిగిన సంస్మరణ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీకి కత్తిని బహూకరిస్తున్న పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్