జాతీయ వార్తలు

అరుదైన ప్లాస్టిక్ సర్జరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇండోర్, జూలై 3: ఇండోర్ వైద్యులు అరుదైన ఘనతను సాధించారు. పనె్నండేళ్ల బాలుడికి మాయమైన ముక్కును కృత్రిమంగా సృష్టించి యథాస్థానంలో ఇంప్లాంట్ చేసి విజయం సాధించారు. ఉజ్జయిని పట్టణానికి చెందిన అరుణ్ పటేల్ (12) నెలరోజుల వయసులో ఉన్నప్పుడే ఇంజక్షన్ కారణంగా సైడ్ ఎఫెక్ట్‌తో అతని ముక్కు దాదాపు మాయమైపోయిందని అతనికి సర్జరీ చేసిన వైద్యుల బృందానికి నేతృత్వం వహించిన డాక్టర్ అశ్విని దాష్ తెలిపారు. ‘‘సాధారణంగా ఏదైనా అవయవం లేకపోవటమో లేక దెబ్బతినటమో జరిగినప్పుడు రినోప్లాస్టీ సర్జరీద్వారా యథారూపానికి తీసుకురావటం జరుగుతుంది. కానీ అరుణ్ పటేల్ విషయంలో అలా చేయటానికి ఆస్కారం లేకుండా పోయింది. ఎందుకంటే అతని ముక్కు దాదాపుగా మాయమే అయింది. అందువల్ల ప్రత్యేక ప్లాస్టిక్ సర్జరీ నిర్వహించాలని మేం నిర్ణయించాం. ఈ సర్జరీని వైద్య పరిభాషలో ప్రి ఫాబ్రికేటెడ్ ఫోర్‌హెడ్ ఫ్లాప్ రినోప్లాస్టీ అంటారు’’ అని డాక్టర్ అశ్విని వివరించారు. ఈ సర్జరీ పూర్తి కావటానికి దాదాపు ఏడాది కాలం పట్టింది. తొలి దశలో ప్రత్యేకమైన సిలికాన్ కణజాలాన్ని అరుణ్‌పటేల్ నుదుటిభాగంపై ఉంచారు. ఆ తరువాత రెండో దశలో పటేల్ గుండె కిందిభాగం నుంచి ఒక గట్టి సజీవ నరాన్ని బయటకు తీసి అతని నుదుటిపై కృత్రిమ ముక్కును తయారుచేశారు. ఆ తరువాత మూడు నెలలపాటు దాన్ని అలాగే ఉంచారు. ఈ మూడు నెలల కాలంలో సాధారణంగా ముక్కుకు రక్తప్రసారం జరిగినట్లే ఈ కృత్రిమ ముక్కుకూ రక్తప్రసారం జరగటంతోపాటు అందులోని కణాలన్నిటిలోనూ చురుకుదనం, కదలికలు వచ్చేంతవరకూ పర్యవేక్షణలో ఉంచారు. ఈ సాధారణ ముక్కుల మాదిరిగానే పనిచేయటం ప్రారంభించిన తరువాత మూడో దశలో కృత్రిమ ముక్కును నుదుటి పైనుంచి తొలగించి అందరికీ ఉండే స్థానంలోకి విజయవంతంగా మార్చారు. ఇక నాలుగో దశలో ఏ నుదుటి భాగం నుంచి కృత్రిమ ముక్కును తొలగించారో ఆ నుదుటి భాగాన్ని సాధారణ రూపానికి తీసుకువచ్చారు. ఇప్పుడు అరుణ్ ఆరోతరగతి చదువుతున్నాడు.

చిత్రాలు..బాలుడి నుదుటి భాగంగా కృత్రిమంగా తయారు చేసిన ముక్కు
శస్త్ర చికిత్స పూర్తయన అనంతరం అరుణ్ పటేల్‌తో డాక్టర్ అశ్విని దాష్