జాతీయ వార్తలు

11నుంచి సమ్మె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 3: ఏడవ వేతన సంఘం సిఫార్సుల మేరకు పెంచిన వేతనాలు తమకు సరిపోవంటూ దేశవ్యాప్తంగా ఉన్న 33 లక్షల పైచిలుకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈ నెల 11నుంచి సమ్మె చేస్తామని హెచ్చరిస్తున్నారు. 7 వేల రూపాయలుగా ఉన్న బేసిక్ వేతనాన్ని 2.57 శాతం ఫిట్‌మెంట్ ఫార్ములా ప్రకారం వేతన సంఘంలో రూ. 18 వేలుగా నిర్ణయించారు. అయితే 3.68 శాతం ఫిట్‌మెంట్ ఫార్ములా ప్రకారం రూ 28,000గా నిర్ణయించాలని మేము డిమాండ్ చేస్తున్నాం’ అని అఖిల నారత రైల్వే మెన్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి, జాతీయ సంయుక్త కార్యాచరణ కౌన్సిల్ కన్వీనర్ అయిన శివగోపాల్ మిశ్రా ఆదివారం ఇక్కడ చెప్పారు. ఏడవ వేతన సంఘం ఇచ్చిన పెంపుదలలను వ్యతిరేకించడం కోసం కానె్ఫడరేషన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లారుూస్(సిసిజిఇ), ఆలిండియా డిఫెన్స్ ఎంప్లారుూస్ ఫెడరేషన్, పెన్షనర్ల అసోసియేషన్ జాతీయ కోర్డినేషన్ కమిటీ లాంటి ఆరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలుకలిసి నేషనల్ జాయింట్ కౌన్సిల్ ఫర్ యాక్షన్ (ఎన్‌జెసిఏ)గా ఏర్పడ్డాయి. ఈ నిర్ణయాన్ని పునః పరిశీలిస్తామంటూ ప్రభుత్వంనుంచి తమకు స్పష్టమైన హామీ లభించని పక్షంలో రక్షణ దళాల ఉద్యోగులు మినహా దాదాపు 33 లక్షల ప్రభుత్వ ఉద్యోగులు ఈ నెల 11నుంచి సమ్మెలో వెళ్తామని, కనీస వేతనమే ప్రధాన సమస్య అని సిసిజిఇ అధ్యక్షుడు, పెన్షనర్ల అసోసియేషన్ జాతీయ సమన్వయ కమిటీ ప్రధాన కార్యదర్శి అయిన కెకెఎన్ కుట్టి చెప్పారు.
గత నెల 30వ తేదీ సాయంత్రం హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, రైల్వేమంత్రి సురేశ్ ప్రభులతో కూడిన మంత్రుల గ్రూపుతో తాము సమావేశం అయ్యామని, ఈ విషయాన్ని పరిశీలించి వేరే కమిటీకి నివేదిస్తామని వారు తమకు చెప్పారని మిశ్రా తెలిపారు. సోమవారం సాయంత్రం లేదా మంగళవారం ఉదయం ప్రభుత్వంనుంచి పిలుపు వస్తుందని తాము ఎదురు చూస్తున్నామని, నోటిమాటగా కాక స్పష్టమైన హామీ లభిస్తే సమ్మెను వాయిదా వేసుకునే అంశాన్ని పరిశీలిస్తామని కుట్టి చెప్పారు. సమ్మెపై నిర్ణయం తీసుకోవడానికి ఈ నెల 5న తాము సమావేశం ఏర్పాటు చేసుకున్నామని అయన చెప్పారు. 2004 అక్టోబర్‌లో అమలులోకి వచ్చిన కొత్త పెన్షన్ స్కీమును ఉపసంహరించుకోవాలని కూడా ఎన్‌జెసిఏ డిమాండ్ చేస్తోంది.