జాతీయ వార్తలు

భారతీయుల విడుదలకు కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 3: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక వ్యక్తితో సహా నైజీరియాలో కిడ్నాపైన ఇద్దరు భారతీయులను విడిపించేందుకు విదేశాంగశాఖ ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ తెలిపారు. తెలుగువాడైన మంగిపూడి శ్రీనివాస్ తన సహచర ఉద్యోగి అనీశ్ శర్మ(కర్ణాటక)తో కలిసి గత బుధవారం రాత్రి 7.20 గంటల ప్రాంతంలో నైజీరియాలో డాంగోట్ సిమెంట్ ప్లాంట్‌కు కారులో వెళ్తుండగా ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర అపహరించుకుపోయారు. ‘అనీశ్ శర్మ భార్యతో ఈ ఉదయం(ఆదివారం) మాట్లాడాను. అనీశ్, శ్రీనివాస్‌లను ఇద్దరినీ కిడ్నాపర్ల నుంచి విడిపించుకురావటానికి అన్నిరకాల ప్రయత్నాలు చేస్తున్నామని ఆమెకు చెప్పాను’ అని ఆమె ట్వీట్ చేశారు. రెండు కుటుంబాలకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించేందుకు ఒక సీనియర్ అధికారిని నియమించామని సుష్మ పేర్కొన్నారు. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ మాట్లాడుతూ నైజీరియాలో ఇలాంటివి సర్వసాధారణంగా జరుగుతూంటాయి. ఇందులో కొత్తేమీ లేదని వ్యాఖ్యానించారు. ఈ ఇద్దరు భారతీయుల అపహరణ వెనుక బొకోహరామ్ వంటి ఉగ్రవాదుల హస్తం లేదని. స్థానిక నేరగాళ్లే ఈ అపహరణకు పాల్పడ్డారని ఆయన అన్నారు.