జాతీయ వార్తలు

ఇక సత్వర న్యాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దేశంలో జరుగుతున్న అత్యాచారాలకు సంబంధించి కేసులను త్వరితగతిన విచారించడానికి దేశవ్యాప్తంగా ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని కేంద్ర న్యాయశాఖ ప్రతిపాదిస్తోంది. హోం కార్యదర్శితో చర్చల అనంతరం ఆ శాఖ ప్రత్యేక ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయడానికి ఈ మేరకు ఒక నివేదికను సిద్ధం చేసింది. తాము డ్రాఫ్ట్‌ను సిద్ధం చేశామని, కేంద్రం అనుమతి కోసం వేచి చూస్తున్నామని జూన్ 14న న్యాయశాఖ తెలియజేసింది. ఇటీవల కథువా, సూరత్‌లలో చిన్నారులపై జరిగిన అత్యాచారాల కేసుల నేపథ్యంలో 12 సంవత్సరాలు, అంతకంటే చిన్నవయసు బాలికలపై అత్యాచారాలకు పాల్పడిన వారికి మరణశిక్ష వేయాలని ఇటీవల కేంద్రం ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. నిందితులపై విచారణ త్వరగా పూర్తి చేసి శిక్ష విధించడానికి కోర్టుల అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక కోర్టుల ఆవశ్యకతను గుర్తించి ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయడానికి సిద్ధపడుతోంది. దీనినిమిత్తం కింది కోర్టులకు వౌలిక సదుపాయాల కల్పన, న్యాయ అధికారులు, జడ్జీలు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, ఫోరెన్సిక్ కిట్‌లు అంకితభావం గల కేసు పరిశోధకులు అవసరమవుతాయి. కోర్టుల ఏర్పాటు అంశం రాబోయే కేబినెట్ సమావేశంలో ఆమోదానికి రానుంది. ప్రత్యేక ట్రాక్ కోర్టులతో బాధితులకు, వారి కుటుంబాలకు సత్వర న్యాయం జరుగుతుందని కేంద్రం భావిస్తోంది. అంతేకాకుం డా కేసు దర్యాప్తు వేగంగా జరుగుతుందని, బాధితులకు వైద్య పరీక్షలు, పోలీస్ సహకారం వేగంగా అందుతుందని కేంద్రం పేర్కొంటోంది. ఈ కేసుల దర్యాప్తుకు కాలపరిమితి కూడా ఉంటుంది. అత్యాచారం వంటి కేసుల దర్యాప్తును రెండు నెలల్లో పూర్తి చేయాల్సి ఉంది. అంతేకాకుండా కోర్టులో విచారణ కూడా రెండు నెలల్లో పూర్తవుతుందని అధికారులు తెలియజేశారు. అలాగే ఈ కేసుకు సంబంధించి అప్పీల్‌కు ఆరు నెలల్లో వెళ్లాల్సి ఉంటుంది. కొత్తగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులను సృష్టించడంతో పా టు ఫోరెన్సిక్ కిట్స్‌ను పోలీస్‌స్టేషన్లు, హాస్పిటల్స్‌కు అందజేస్తారు. అలాగే అత్యాచార కేసులకు సంబంధించి ప్రతి జిల్లాలో ప్రత్యేక ఫోరెన్సిక్ లేబ్‌లను ఏర్పాటు చేస్తారు.