జాతీయ వార్తలు

తెలుగు రాష్ట్రాలే టాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సులభతర వ్యాపార విధానంలో మొదటి స్థానం, రెండో స్థానం దక్కింది. మూడో స్థానం హర్యానా, నాలుగో స్థానం గుజరాత్ రాష్ట్రాలకు దక్కాయి. కేంద్ర వాణిజ్య శాఖ డీఐపీపీ కార్యదర్శి రమేష్ అభిషేక్ మంగళవారం ఒక కార్యక్రమంలో రాష్ట్రాలు సాధించిన ర్యాంకులను ప్రకటించారు. కేంద్ర వాణిజ్య శాఖకు చెందిన డీఐపీపీ విభాగం ప్రపంచ బ్యాంకుతో కలిసి చేసిన సంస్కరణల అమలు సర్వే ప్రకారం ఈ ర్యాంకులు ఇచ్చారన్నారు. కేంద్ర ప్రభుత్వం సేవలు, విధుల సమర్థత, పారదర్శక పద్ధతిలో లబ్ధిదారులకు అందజేసే ప్రక్రియను వేగవంతం చేయటం ఈ సర్వే లక్ష్యం. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తమ విధానాలు, సేవలను సంస్కరించటం ద్వారా వ్యాపార వ్యవహారాల నిర్వహణను సులభతరం చేశాయి. కార్మిక శాఖ, పర్యావరణ అనుమతులు, ఏక గవాక్ష పద్ధతి, నిర్మాణ అనుమతులు, ఒప్పందాలను అమలు చేయటం, ఆస్తులను రిజిష్టరు చేయటం, పర్యవేక్షించటం తదితర రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు సంస్కరణలు చేపట్టాయి. రిజిష్ట్రేషన్లు, అనుమతులు సకాలంలో జరిగేలా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ప్రజాసేవ పంపిణీ గ్యారంటీ చట్టాన్ని కూడా అమలు చేస్తున్నాయి. ఆయా రాష్ట్రాలకు మంగళవారం ప్రకటించిన ర్యాంకింకులను 2017 బీఆర్‌ఏపీ కింద ఇచ్చారు. ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అందజేసిన సంస్కరణల అమలు సాక్ష్యాలు, ఆయా వ్యాపార సంస్థలు తమకు రాష్ట్రాల నుండి అందజేసిన సేవలపై వ్యక్తం చేసిన అభిప్రాయాల ఆధారంగా
ఈ ర్యాంకులు నిర్ధారించారు. సంస్కరణలు లబ్ధిదారులకు అందాయా లేదా అనేది తెలుసుకున్న తరువాతనే ఆయా రాష్ట్రాలకు ర్యాంకులు ఇవ్వటం గమనార్హం. ఇదిలా ఉండగా తెలంగాణ, పశ్చిమ బెంగాల్, త్రిపుర, నాగాలాండ్ రాష్ట్రాలకు సంస్కరణల అమలులో సహాయం చేసేందుకు పెద్ద ఎత్తున సదస్సులు నిర్వహించినట్లు కేంద్ర వాణిజ్య శాఖ తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన సంస్కరణల అమలు ప్రయత్న ప్రభావం బ్రెజిల్, దక్షిణాఫ్రికా, ఇండోనేషియా వంటి దేశాలపై కూడా పడిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు.