జాతీయ వార్తలు

ముంబయి అతలాకుతలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూలై 10: ముంబయి మహానగరం భారీ వర్షాలతో అతలాకుతలమైంది. నగరంలో ప్రజా జీవితం స్తంభించింది.వరుసగా కురుస్తున్న వర్షాలతో రవణా వ్యవస్థ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. రైల్వే సర్వీసులపై ప్రతికూల ప్రభావం పడింది. పశ్చిమ రైల్వేలో సబర్బన్ రైల్వే సర్వీసులను సస్పెండ్ చేశారు. దూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లు, ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ రైళ్లు గంటల తరబడి ఆలస్యంగా బయలుదేరుతున్నాయి. ముంబాయితో పాటు థానే, పాల్గార్ ప్రాంతా లు జలమయమయ్యాయి. మోకాలు లోతు నీళ్లు రోడ్ల పైన ప్రవహిస్తున్నాయి. కుంభవృష్టితో నగరానికి మంచినీటిని సరఫరా చేస్తున్న తులసి సరస్సు ఉప్పొంగింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో డబ్బావాలాలు లంచ్ బాక్స్‌ల సేకరణ, అందించే పనులను నిలిపివేశారు. మరో వైపు ఈ భారీ వర్షాలు మరో రెండు రోజులు కొనసాగుతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. గత 24 గంటల్లో కొలాబాలో 165.8 ఎంఎం, శాంతాక్రజ్‌లో 184.3 మి.మీ వర్షపాతం నమోదైంది. ఈ ప్రాం తంలో గత రాత్రి నుంచి 200 మి.మీ వర్షపాతం నమోదైంది. ముంబయిలో పల్లపు ప్రాంతాలు సరస్సులుగా మారాయి. రైల్వే ట్రాక్‌లపై వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో రైళ్లను ఎక్కడికక్కడ నిలిపివేసినట్లు రైల్వే శాఖ ప్రకటించింది. సబర్బన్ జిల్లాల్లో ఏసీ రైళ్లను సస్పెండ్ చేసినట్లు పశ్చిమ రైల్వే పేర్కొంది. కొన్ని చోట్ల మాత్రమే లోకల్ రైళ్లను నడుపుతున్నారు. ట్రాక్‌పై నిలిచిన నీటిని తోడేందుకు పెద్దఎత్తున నీటిని తోడే యం త్రాలను ఉపయోగిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఆర్మీ, నౌకాదళ సిబ్బది రంగంలోకి దిగారు. హిం ద్మాత, పరేల్, కింగ్స్ సర్కిల్, ధార్వాయి. కుర్ల, సియాన్, బాండూప్, విక్రోలి, ములాండ్, దాదర్, బొరివిలిలో ప్రజలకు సహాయక చర్యలను చేపట్టేందుకు విపత్తు యాజమాన్య బలగాలు రంగంలోకి దిగాయి. వర్ష బా ధితులకు ఆహార పొట్లాలు, మంచినీటిని అందిస్తున్నా రు. వెస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ హైవే పైన వాహనాల రాకపోకలు స్తంభించాయి. బెస్ట్ బస్సు సర్వీసులను 14 రూట్లలో మళ్లించారు. కాగా అతి పెద్ద తుపాను ముంబయి నగరాన్ని తాకనుందనే తప్పుడు సమాచారాన్ని నమ్మ వద్దని బీఎంసీ కమిషనర్ ప్రజలను కోరారు.
చిత్రం..భారీ వర్షాల తర్వాత నలసోపరా స్టేషన్ వద్ద సబర్బన్ రైల్